బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళిపై ఇప్పుడు నార్త్ మీడియా ఓ కన్నేసి ఉంచిందనేది వాస్తవం. ముఖ్యంగా జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ RRRపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. సినిమా అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో అనేక కథనాలు వెలువడ్డాయి. 

అయితే సినిమాలో కథానాయకులు టెక్నీషియన్స్ తప్పితే ఎలాంటి విషయాలు బయటకు రాలేవు. విలన్ - హీరోయిన్స్ అలాగే ఇతర నటీనటుల విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే కన్నడ యువ హీరో యాష్ RRR సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నట్లు ఇటీవల సౌత్ టూ నార్త్ అనేక వార్తలు వచ్చాయి. 

జక్కన్న టీమ్ ఆ రూమర్స్ పై స్పందించలేదు. అయితే యాష్ సోషల్ మీడియా ద్వారా తొందరగానే క్లారిటీ ఇచ్చాడు. వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న కథనాలు పూర్తిగా అబద్దమని పేర్కొన్నాడు. అయితే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అను యాష్ వివరణ ఇచ్చాడు. 

యాష్ నటించిన కేజిఎఫ్ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై యూ ట్యూబ్ లో తెగ వైరల్ అయ్యింది. తెలుగులో సినిమాను ఈగ నిర్మాత సాయి కొర్రపాటి రిలీజ్ చేయనున్నారు. ఇక రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ కావడం.. ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఆయన వస్తుండడంతో యాష్ RRR లో భాగం కానున్నాడు అని వార్తలు వచ్చాయి.