`కేజీఎఫ్2` టీజర్ ఇప్పటికే 188మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఎనిమిది మిలియన్స్ కిపైగా లైకులు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేయగా, ఇప్పుడు మరో విభాగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇండియన్ ఆడియెన్న్ ఆసక్తికరంగా చూస్తోన్న సినిమాల్లో `కేజీఎఫ్ 2` ఒకటి. తొలి భాగం సృష్టించిన సంచలనాలతో `ఛాప్టర్2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో యష్ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది. ఈ టీజర్ ఇప్పటికే 188మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఎనిమిది మిలియన్స్ కిపైగా లైకులు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేయగా, ఇప్పుడు మరో విభాగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్‌కి యూట్యూబ్‌లో ఒక మిలియన్ అంటే పది లక్షల కామెంట్లని పొంది రికార్డ్ క్రియేట్ చేసింది.
తాజాగా యూనిట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ టీజర్ కన్నడ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. యూనివర్సల్ టీజర్‌గా రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇందులో కన్నడ హీరో యష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రాకీ భాయ్‌గా ఆయన కనిపించనున్నారు. తొలి భాగంలోనే తనదైన స్టయిలీష్ నటనతో స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు రెండో భాగంతోనూ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాని జులైలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలున్నాయి.
ఈ సినిమాని ప్రశాంత్ నీల్ రూపొందించగా, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగుదూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. రవీనా టండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండో భాగంగా నిడివి దాదాపు మూడు గంటలుంటుందని సమాచారం.
