ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం సౌత్ కన్నా బాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ముంబై నుంచి ఈ చిత్రం ప్రమోషన్స్ నార్త్ ఇండియాలో జరుగుతూండటంతో అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా గురించి బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్దలు మాట్లాడుకోవటం మొదలెట్టాయి. దాంతో రైట్స్ కోసం ఎంక్వైరీలు మొదలయ్యాయి. 

అయితే  రిలీజ్ దగ్గర పడుతుండటంతో..  దాదాపు ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు క్లోజ్ చేసేసారు.  కానీ ఓవర్ సీస్ రైట్స్ తీసుకోవాలని యష్ రాజ్ ఫిల్మ్ వారు ఉత్సాహపడ్డారు. కానీ ఆల్రెడీ ఓవర్సీస్ రైట్స్ ను 'ఫర్ ఫిల్మ్స్' సంస్థ రూ. 42 కోట్లకు తీసుకుంది. ఈ సంస్థకు గల్ఫ్ ఏరియాలో బలమైన థియేటర్ నెట్వర్క్ ఉండటం కలిసి వచ్చే అంశం. గల్ఫ్‌లో సగానికిపైగా ఎక్కువ థియేటర్లు ఈ సంస్థకు చెందినవే. అయితే బయటి దేశాల్లో మాత్రం  ఈ సంస్దకు ఈ పరిస్థితి అలా లేదు. దాంతో వాళ్ళు యష్ రాజ్ ఫిల్మ్స్ తో టై అప్ పెట్టుకున్నారు. 

గల్ఫ్ మినహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లో విడుదల చేసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో చేతులు కలిపారు. అమెరికా,మిగతా దేశాల రైట్స్ ని  యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థకు రూ. 21 కోట్లకు మినిమమ్ గ్యారంటీ బేసిస్ మీద అమ్మినట్లు తెలుస్తోంది.  ఈ రేటు ఓవర్ సీస్ లో గల్ఫ్ కంట్రీలు మినహా పలకటం ఆశ్చర్యకరంగా ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.