Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంతో అందరి హృదయాలని దోచుకుంటుంది. అపార్ధాల మధ్య నడిచే భార్యాభర్తల బంధం నేపథ్యంతో సాగుతుంది కధ. ఇక ఈరోజు మార్చి 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో వేద ఫోటోని చూస్తూ కూర్చుంటాడు విన్ని. వేద యష్ ని కొట్టిన సందర్భాన్ని తలుచుకొని నవ్వుకుంటాడు. ఆమె ఫోటో దగ్గరికి వెళ్లి నా గుండె చప్పుడు వినిపిస్తుందా, నా గుండె చప్పుడు నువ్వే, నా ఊపిరి నువ్వే. నువ్వు పుట్టిందే నాకోసం అర్థం చేసుకోవేంటి. బెస్ట్ ఫ్రెండ్ అంటావేంటి బెస్ట్ లవర్ ద వరల్డ్ బెస్ట్ లవర్ ని అనుకుంటాడు.

నువ్వు నాకే దక్కాలి పనికిమాలిన యశోదర్ కి నువ్వు పెళ్ళాం ఏంటి నేను ఒప్పుకోను. నీ దృష్టిలో వాడిని చెడ్డ చేయటానికి చాలా సార్లు ప్రయత్నించాను కానీ కుదరట్లేదు అయినా ఊరుకోను నా ప్రయత్నం నేను చేస్తాను మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని బ్రేక్ చేస్తాను నాతో నిన్ను యూఎస్ తీసుకు వెళ్ళిపోతాను. యు ఆర్ మై ఓన్ వేదు. నిన్ను నా సొంతం చేసుకుంటాను ఇట్స్ మై ఛాలెంజ్ అనుకుంటాడు.

అంతలోనే అక్కడికి వచ్చిన రౌడీలని చాచి కొడతాడు విన్ని. నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి ఒక అమ్మాయిని కూడా మీరు కిడ్నాప్ చేయలేకపోయారా అంటూ అక్కడి నుంచి పొమ్మంటూ కేకలు వేస్తాడు విన్ని. మరోవైపు భార్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంత రాత్రి అయినా రాలేదు ఇంకా నా మీద కోపం పోలేనట్లు ఉంది అయినా ఎలా పోతుంది ఆ వసంతగాడి ప్లాన్ విని నేను చేసిన వెధవ పనికి.

అయినా ఈమధ్య నాకు టైం అసలు బాగోట్లేదు. బెస్ట్ సీఈఓ అయినంత ఈజీ కాదు బెస్ట్ హస్బెండ్ అవడం. మొత్తం ప్రపంచాన్ని గెలవచ్చు కానీ భార్య మనసును గెలవడం మాత్రం చాలా కష్టం అనుకుంటాడు యష్. తనని ఎలాగైనా సారీ చెప్పి కూల్ చేయాలి ఎలా అనుకుంటాడు. తనని ఇంప్రెస్ చేస్తే కూల్ అవుతుంది అనుకుంటూ బెడ్ క్లీన్ చేస్తాడు. నీట్ గా ఉన్న బెడ్డుని చూసి కూల్ అవుతుంది.

అప్పుడు సారీ చెప్పొచ్చు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటాడు యష్. అంతలోనే అక్కడికి వేద వస్తుంది. బెడ్ నీట్ గా చేసినంత మాత్రాన ఇంప్రెస్ అయిపోతాను నెవర్ అనుకుంటూ దిండు తీసుకొని సోఫా మీద పడుకుంటుంది. తనని ప్రశాంతంగా పడుకోని ఇప్పుడు డిస్కషన్ ఎందుకు అనుకొని ఆమెని చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో ఫోన్ రావటంతో వేద డిస్టర్బ్ అవుతుందని ఆమె ఫోన్ ని సైలెంట్ లో పెట్టేస్తాడు.

ఆమె తనమీద చూపించిన కంగారుని తలుచుకొని సంతోషిస్తాడు. పొద్దున లేచే సరికి వేద ఇంకా లేవదు. రాత్రంతా ఇబ్బంది పడుతూ ఈ సోఫా మీద పడుకునే బదులు చక్కగా బెడ్ మీద పడుకోవచ్చు కదా అనుకుంటాడు అయినా నాది కూడా తప్పు ఉంది అనవసరంగా అప్సెట్ చేశాను తను లేచిన వెంటనే ముందు సారీ చెప్పాలి అనుకుంటాడు యష్.

ఈలోపు ఖుషి ని రెడీ చేస్తాను తను కొంచెం రిలాక్స్ అవుతుంది. అప్పుడు సారీ చెప్తే పూర్తిగా కూల్ అవుతుంది అనుకుంటూ ఖుషి రూమ్ కి వెళ్లి ఆమెని నిద్ర లేపుతాడు. లేవటానికి ఆమె మారం చేస్తుంటే బుజ్జగించి ఆమెని లేపుతాడు. మమ్మీ ఏది అని అడిగితే అలసిపోయి పడుకుంది తను లేచేసరికి రెడీ అయిపోయి ఆమెకి సర్ప్రైజ్ ఇద్దాం అంటాడు యష్. సరే అంటూ ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది ఖుషి.

ఇంతలోనే వేద లేచి లేటుగా లేచినట్లు ఉన్నాను అనుకుంటుంది. అంతలోనే ఖుషి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది. అప్పుడే రెడీ అయిపోయావా నిన్ను ఎవరు రెడీ చేశారు అంటే డాడీ రెడీ చేశారు అని చెప్తుంది. నాకు స్కూల్ కి టైం అవుతుంది తాతయ్య డ్రాప్ చేస్తానన్నారు అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఖుషి.యష్ వేదతో తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వదు వేద.

ఇంకా నామీద కోపం పోలేనట్లుగా ఉంది మంచి కాఫీ ఇస్తే కొంచెం కూల్ అవుతుంది అనుకుంటూ కిచెన్ వైపు వెళ్తాడు యష్. మరోవైపు ఫైల్ మీద సైన్ కావాలి అనుకుంటూ అభి రూమ్ కి వెళుతుంది చిత్ర. అప్పటికే అభి గోల్డ్ చైన్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ టైంకి వచ్చావు అంటూ ఆమె మెడలో చైన్ వేయబోతాడు. ఎక్స్క్యూజ్మీ అనుకుంటూ వెనకడుగు వేస్తుంది చిత్ర.

ఇది మాళవిక కోసం తీసుకుంటున్నాను అందుకే నీ మీద ట్రై చేస్తున్నాను అంటాడు అభి. సిటీలోనే లేటెస్ట్ నక్లిస్, కొలత తెలుస్తుంది వేసుకోండి మేడం అంటాడు మార్వాడి. మీరేమీ వేయక్కర్లేదు నేనే వేసుకుంటాను అంటూ తనే వేసుకుంటుంది చిత్ర. పర్ఫెక్ట్ గా సూట్ అయింది నువ్వు వేసుకోవడం వల్ల నెక్లెస్ కే అందం వచ్చింది అంటాడు అభి.

వెంటనే నెక్లెస్ తీసేసి ఇది మీరు మాళవిక కోసం కొన్నారు కదా తీసుకెళ్లి తన మెడలోనే వెయ్యండి సంతోషపడుతుంది అంటుంది చిత్ర. ఈ ఫైల్ మీద సంతకం పెట్టి పంపించండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కుషిని రెడీ చేసేస్తే కూల్ అయిపోతానా,ఛాన్స్ లేదు అనుకుంటుంది వేద. నాకోసం పాపని రెడీ చేశారు తర్వాత తర్వాత ఇంట్లో పనులు కూడా చేసేస్తారేమో అని నవ్వుకుంటుంది వేద.

అలా అనుకుంటూ తన ఫోన్ ని చూసుకుంటే అందులో 20 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఎన్నిసార్లు ఎందుకు చేశారో అనుకుంటూ ఆ నెంబర్ కి కాల్ చేస్తుంది. మా పాపకి 101 ఫీవర్ ఇంత ఇర్ రెస్పాన్సిబిలిటీ అయితే ఎలాగా అంటూ కేకలు వేస్తుంది పేషెంట్ తల్లి. సారీ అండి ఇప్పుడు పాపకి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంది వేద. ఎవడికి కావాలి నీ బోడి సారీ.

రేపు ప్రాణం పోయినా కూడా ఇలాగే చేస్తారా ఇంత ఇర్ రెస్పాన్సిబిల్ డాక్టర్ని నేను ఎక్కడా చూడలేదు లైఫ్ లో నీ మొహం కూడా చూడను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆవిడ. ఫోన్ సైలెంట్ లో ఉండడాన్ని గమనించి కోపంగా బయటికి వెళ్తుంది. నా ఫోను సైలెంట్ లో పెట్టింది ఎవరు అని గట్టిగా అడుగుతుంది. నేనే అంటాడు యష్. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.