Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్లో వేద గతంలో యష్ తో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని కళ్ళు తెరుస్తుంది. అప్పుడు చుట్టూ చూస్తూ తనకు ఏమయిందో అన్న అయోమయంలో ఉంటుంది వేద. అప్పుడు తనకు ఏమయ్యింది అనుకుంటూ ఏవండీ ఏవండీ అని పిలుస్తూ ఉంటుంది. మరొకవైపు ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చిత్ర వసంత్ వస్తారు. భోజనం చేయండి బావగారు అనగా నాకేం వద్దు అని అంటాడు. జ్యూస్ తీసుకొని వస్తాను అనడంతో నాకేం వద్దు వసంత్ అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

నావల్లే మీ వదినకు ఇలా అయింది నేను రెచ్చగొట్టడం వల్ల వేద ఉపవాసం ఉంది తన కు పరిస్థితికి కారణం నేనే అని యష్ బాధపడుతూ ఉంటాడు. నా మీద ఉన్న పంతంతో తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టింది అని బాధపడుతూ ఉంటాడు. నేను ఒక్కరోజు తట్టుకోలేను అలాంటిది వేద మూడు రోజులు ఏమి తినకుండా ఆకలిని ఎలా తట్టుకుందో కడుపు మంటను ఎలా భరించిందో అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. తనకు చిన్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం ఉందంటే నాకు తెలియదు అని చెబుతూ ఏడుస్తూ ఉంటాడు. తను అసలు ఉపవాసం ఉండకూడదు ఆ విషయం తెలియక తనని పస్తులు పెట్టాను అని బాధపడుతూ ఉంటాడు.

తన ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా నా కోసం నా కుటుంబం కోసం వేద ఇంత చేసింది అని బాధపడుతూ ఉంటాడు యష్. అప్పుడు వసంత్ చిత్ర ఇద్దరూ యష్ ని ఓదారుస్తూ ఉంటాడు. వేద లేకుంటే ఈ యశోదర్ లేడు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు డాక్టర్ వేద నీకు హెల్త్ ఎలా ఉంది అనడంతో మా హస్బెండ్ ని ఒకసారి పిలవండి డాక్టర్ అనగా నర్స్ పిల్చుకొని రావడానికి వెళ్తుంది. ఆ తర్వాత నర్స్ విన్నీ దగ్గరికి వెళ్లి వేదకి స్పృహ వచ్చింది అని చెప్పడంతో విన్నీ సంతోషపడుతూ లోపలికి వెళ్తుండగా మీరు కాదు సార్ వాళ్ళ భర్త యశోదర్ ని రమ్మని చెప్పండి అనడంతో సరే అని అంటాడు విన్నీ.

ఆ తర్వాత యష్ లోపలికి వేద దగ్గరికి వెళ్లి వేదని చూసి సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు వేద యష్ ని చూసి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు యష్, వేద ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసి సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు వేద అసలు నాకు ఏమయ్యింది ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు అనగా నువ్వు అసలు డాక్టర్ వేనా హెల్త్ ఇష్యూ ఉందని తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు నా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది అనగా చచ్చిపోయి దాన్నా అనడంతో అలా మాట్లాడకు అని అంటాడు. నువ్వు 24 గంటల పాటు ఐసీయూలో ఉంటే నాకు అసలు ఏం తోచలేదు ఎంత టెన్షన్ పడ్డాను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు అని యష్ కోపంతో మాట్లాడుతూ ఉంటాడు.

హలో మాస్టారు మీరు అంత టెన్షన్ పడకండి నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోను అని అంటుంది. ఒకవేళ బలవంతంగా తీసుకువెళ్లిన వచ్చి దెయ్యంలా మారి నేను పీక్కుతింటాను అని అనడంతో యష్ వేద ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి హెల్త్ బాగుందా అయినా నువ్వు డాక్టర్ ఏ కదా నీ ఆరోగ్యం గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అని అంటుంది. ఇకమీద నుంచి తన ఫాస్టింగ్ ఉండకూడదు ఎవరి త్రీ హవర్స్ కి ఫుడ్ ఇవ్వాలి మీ భార్య మీ జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా నేను వెళ్లి ఇంటికి ఫోన్ చేసేస్తాను నువ్వు రిలాక్స్ అవ్వు అని వెళ్ళిపోతాడు.

అప్పుడు వేద యష్ లో వచ్చిన మార్పు చూసి సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు అభిమన్యు కంపెనీలో ఒక స్టాఫ్ అమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తూ ఉండగా అది చూసి చిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత వేద కోసం ఫుడ్ తీసుకొని రాగా ఇప్పుడు ఎందుకండి ఇంకొద్ది సేపటికి ఎలాగో ఇంటికి వెళ్తాము కదా అప్పుడు అనగా ఆపుతావా చెప్పింది చెప్పినట్టు వినాలి అని అంటాడు. అప్పుడు యశోదర్ సీరియస్గా కాకుండా ఫన్నీగా వార్నింగ్ ఇస్తూ ఉండగా ఏంటి యశోదర్ అప్పుడే మొదలు పెట్టేసావా కూల్ గా చెప్పాలి ఇలా సీరియస్గా కాదు అనడంతో యష్ కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద విన్నీ ఇద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి యష్ కుళ్లుకుంటూ ఉంటాడు.

 అప్పుడు యష్ విన్నీ ఇద్దరు పూట పోటీగా వేద కి జ్యూస్ తాగమని చెబుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఖుషి రావడంతో వేద ఖుషిని హత్తుకొని సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు వేద ఖుషి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విన్నీ, యష్ ఇద్దరు సంతోషంగా వేద వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు ఖుషి ఇప్పుడు తెచ్చిన సూప్ తాగుతావా లేదా మమ్మీ తాగకపోతే నా మీద ఒట్టే అనడంతో సరే అని వేద తాగుతాను అంటుంది. అప్పుడు వేదకి ఆ సూప్ తినిపిస్తూ ఉంటుంది ఖుషి.