పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వస్తుంది వకీల్ సాబ్. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన లాయర్ రోల్ చేస్తున్నారు. శృతి హాసన్ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో జతకడుతుంది. కాగా ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ సత్యమేవ జయతే సాంగ్ విడుదల కావడం జరిగింది. థమన్ స్వరాలు అందించిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 


ముఖ్యంగా పాటలోని లిరిక్స్ పవన్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రతిబింబించేలా లిరిక్స్ ఉన్నాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పవన్ కోసం అద్భుతమైన సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రిని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ మోసేశారు. మీరు రాసింది పాట కాదు పవన్ అన్న గురించి మా గుండె చప్పుడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో రామజోగయ్య శాస్త్రిని కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. 


వకీల్ సామ్ మూవీలో పవన్ పాత్ర గురించి పాట రాయమంటే... శాస్త్రి పవన్ కళ్యాణ్ గురించి పాట రాశాడని కొందరు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై అనేక మీమ్స్ కూడా చేయడం జరిగింది. రామజోగయ్య శాస్త్రి మీద చేసిన ఓ మీమ్ ని నెటిజెన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన శాస్త్రి గారు... సినిమా చూశాక మాట్లాడుకుందాం, సరేనా అంటూ రిప్లై ఇచ్చాడు. 


ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బోనీ కపూర్ వకీల్ సాబ్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా అంజలి, నివేదా థామస్ కీలక రోల్స్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ విడుదల కానుంది.