‘ఆదిపురుష్’రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని పూర్తిగా మార్చి చూపించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించినందుకు చిత్ర టీమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని దేశం నలు మూలల నుండి డిమాండ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో సినీ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. హనుమంతుడి సంభాషణలు. ఓ సన్నివేశంలో ఇంద్రజిత్తుతో హనుమాన్ చెప్పే డైలాగ్స్.. అంతటా చర్చకు దారి తీశాయి. ఆ సంభాషణలను తప్పుబడుతూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలోనూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంకా చతుర్వేది సైతం ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ మేరకు ‘ఆదిపురుష్’రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని పూర్తిగా మార్చి చూపించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
మనోజ్ ముంతాషిర్ మాట్లాడుతూ... మేము రామాయణం అయితే తీయలేదు. #Adipursh సినిమా రామాయణం నుంచి బాగా ప్రేరణ పొందాము కానీ..అది రామాయణం అయితే కాదు..అలాగే సంపూర్ణ రామాయణం అయితే తీయలేదు.యుద్దకాండలోని చిన్న అంశం తీసుకుని ఈ సినిమా చేసాము "..అన్నారు. రామాయణాన్ని చిన్నప్పటి నుంచి విన్నట్టుగానే ఆదిపురుష్ సినిమా ద్వారా చెప్పామని, అందులో మార్పులేమీ చేయలేదని చెప్పారు. అదిపురుష్ సినిమాలో డైలాగులు, పాత్రల వర్ణన భిన్నంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడంపై ఆయన స్పందించారు. హిందూ పురాణ గాథ అయిన రామాయణాన్ని చూపించడంలో తాము ఎక్కడా డీవియేట్ కాలేదని మనోజ్ ముంతాషిర్ శుక్లా(Manoj Muntashir Shukla) చెప్పారు.
‘ఆదిపురుష్’లోని డైలాగ్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్‌లోని కొన్ని సంభాషణలు మర్యాదపూర్వకంగా లేవంటూ ఇప్పటికే పలువురు నెటిజన్లు, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సంభాషణలు ఎలా ఉపయోగించారంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు. తాను ఎంతో శ్రద్ధ పెట్టి డైలాగ్స్ రాసినట్లు చెప్పారు. పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే డైలాగ్స్‌ను సరళీకరించానన్నారు.
‘‘హనుమాన్ సంభాషణలు తప్పుగా రాయలేదు. నిశితంగా ఆలోచించాకే డైలాగ్స్ రాశా. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా. పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే డైలాగ్స్‌ను సరళీకరించాను’’ అన్నారు. చర్చకు దారి తీసిన హనుమాన్ డైలాగ్ గురించి స్పందిస్తూ.. ‘‘అలాంటి డైలాగ్స్ రాసిన మొదటి వ్యక్తిని నేను కాదు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కథావాచక్ (జానపద కళాకారులు)లు ‘రామాయణం’ను వివరించేటప్పుడు హనుమంతుడి సంభాషణలను ఇలాగే చెప్పేవారు. వాటినే నేను సినిమాలోకి తీసుకున్నాను’’ అని ఆయన తెలిపారు.
