మోడ్రన్ ఇండియన్ ఇంగ్లీష్ రచయితలలో చేతన్ భగత్ తెలియని వారుండరు. ఆయన రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్, టు స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అత్యంత ఆదరణ దక్కించుకున్నాయి. 3 ఇడియట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మరియు టు స్టేట్స్ అనే సినిమాలు ఆయన నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు. సమకాలీనంగా ఉండే ఆయన నవలలు సింపుల్ ఇంగ్లీష్ లో అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి. కాగా ఈ సెన్సేషనల్ రైటర్ నేడు ఓ బుక్ నేమ్ ప్రకటించారు. 

ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో సందేశం ద్వారా 'వన్ అరేంజ్డ్ మర్డర్' అనే బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ బుక్ కవర్ పేజీ రేపు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఐతే ఆయన ప్రకటించిన టైటిల్ చూసిన వారందరూ ఇది సుశాంత్ రాజ్ పుత్ మరణనాన్ని ఉద్దేశించి అంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సుశాంత్ రాజ్ పుత్ డెత్ ఇన్సిడెంట్ సంచలనంగా ఉండగా, దాని ఆధారంగా ఆయన బుక్ ఉండే అవకాశం కలదని చాలా మంది నమ్ముతున్నారు. 

ఐతే ఇవన్నీ పుకార్లు మాత్రమే, అసలు విషయం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. రేపు కవర్ పేజీ విడుదల నేపథ్యంలో ఈ బుక్ దేని గురించి అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం కలదు. ఇక సుశాంత్ కేసులో విచారణ జరుగుతుండగా అనేక దిగ్బ్రాంతికర విషయాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్స్ చుట్టే తిరుగుతుంది. రియాతో పాటు, అంకిత లోఖండే పాత్రపై కూడా విచారణ సాగుతుంది.