టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ కూడా సామాజిక స్పృహ కలిగిన హీరోనే. ఫ్యాన్స్ కి, ప్రజలకు మంచి చేయడంలో ఆయన ముందుంటారు. కాగా నేడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే... ఈ నేపథ్యంలో తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటారు అల్లు అర్జున్.


స్టార్ హీరోలకు సామాజిక బాధ్యత చాలా అవసరం. నలుగురిని ప్రభావితం చేయగల పొజిషన్ లో ఉన్న హీరోలు మంచి పనులు చేయడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది అనేది నిజం. హీరోలు సమాజ హితం కోసం చేసే పనులు ఎందరికో స్ఫూర్తి నింపుతాయి. మరోవైపు హీరోల ఫేమ్, నేమ్ మరో స్థాయికి చేరడానికి కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతూ ఉంటాయి. 

ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ కూడా సామాజిక స్పృహ కలిగిన హీరోనే. ఫ్యాన్స్ కి, ప్రజలకు మంచి చేయడంలో ఆయన ముందుంటారు. కాగా నేడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే... ఈ నేపథ్యంలో తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటారు అల్లు అర్జున్. తాను మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్న అల్లు అర్జున్ పర్యావరణ హితానికి, ప్రజల మంచికి చెట్లు ఎంత అవసరమో తెలియజేశారు. 

మరోవైపు పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఇంటిలోనే వుంటూ కుటుంబంతో గడుపుతున్నారు అల్లు అర్జున్. ఇటీవల కోవిడ్ బారిన పడిన అల్లు అర్జున్ దాదాపు రెండు వారాల చికిత్స తరువాత కోలుకున్నారు. చికిత్స సమయంలో పిల్లలకు దూరమైన అల్లు అర్జున్, కోలుకున్న వెంటనే అర్హ, అయాన్ లను కలిసి సరదాగా ఆదుకున్నారు. 


దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ రెండు భాగాలుగా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప రెండు పార్ట్స్ తెరకెక్కుతున్నాయి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. 

View post on Instagram