నటుడు, డైరెక్టర్ అడివి శేష్ (Adivi Sesh) ఫిల్మ్ కేరీర్ 20 ఏండ్ల కిందనే ప్రారంభమైన గత ఆరేండ్ల నుంచే ఫామ్ లోకి వచ్చారు. ‘క్షణం’ మూవీతో తన జీవితం మారిందంటూ అడివి శేష్ ఈ రోజు ట్విట్టర్ లో ఎమోషనల్ అయ్యారు.  

విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులకు అలరిస్తున్న యంగ్ హీరోల్లో అడివి శేష్ (Adivi Sesh) ఒకరు. అడివి శేషు 1985లో హైదరాబాద్ లోనే పుట్టాడు. కానీ పెరిగింది.. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది మాత్రం అమెరికాలోని కాలిఫోర్నియాలోనే.. అడివి శేష్ పూర్తి పేరు అడివి శేష్ సన్నీ చంద్ర. అయితే శేష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2002 నుంచి యాక్టివ్ గా ఉంటున్నారు. అదే ఏడాది తెలుగులో రిలీజైన ‘సొంతం’ మూవీలో శేష్ ఒక చిన్న అతిథి పాత్రలో నటుడిగా పరిచయం అయ్యాడు. 2010లో ‘కర్మ’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అలాగే రచయితగా కూడా అరంగేట్రం చేశాడు.

ఆ తర్వాత ‘కిస్’ మూవీకకి కూడా రయిచతగా, దర్శకుడిగా సనిచేశారు. కానీ పెద్దగా శేషు మాత్రం పాపులారిటీని సంపాదించుకోలేకపోయాడు. అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ మూవీలో నెగెటివ్ షేడ్ లో కనిపించాడు. ఈ చిత్రంతో శేషు నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘బలుపు, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి : ది బిగెనింగ్, దొంగాట, సైజ్ జీరో’ వంటి సినిమాల్లో సపోర్టెడ్ రోల్స్ లో నటించారు. నటన విషయంలో అడివి శేష్ కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఫిజికల్ గా, మెంటల్ గా శేష్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించాడు. అతని స్క్రిప్టింగ్ నైపుణ్యాలు కూడా అందరినీ ఆకట్టుకునేవి.. కానీ ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోయింది.

అయితే అప్పటి వరకు శేషు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేండ్లు దాటింది. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న శేష్ కు లైఫ్ ఛేంజ్ అయ్యే క్షణాలు వచ్చాయి. 2016లో రవికాంత్ పేరేపు దర్శకుడితో కలిసి శేష్ రాసిన ‘క్షణం’(Kshanam) కథ మరియు స్క్రీన్ ప్లేతో విజయ పథంలో అడుగులు వేయడం ప్రారంభించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు శేష్. ఈ మూవీ తర్వాత వచ్చిన ప్రధాన పాత్ర కథలు దాదాపుగా 50 కంటే ఎక్కువ స్క్రిప్ట్‌లను తిరస్కరించాడు. ఆ తర్వాత సైజ్ జీరో, ఊపిరి చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించాడు. అనంతరం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అమీ తుమీ కామెడీ చిత్రంలోనూ పనిచేశాడు. మళ్లీ 2018లో ‘గూఢచారి’ చిత్రం.. ఒక యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. నెలరోజులుగా పైగా థియేటర్లలో ప్లే అయ్యింది. ఈ చిత్రానికి కూడా ఆయనే రచయిత.. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు.

Scroll to load tweet…

శేష్ కేరీర్ లో ప్రేక్షకకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ‘క్షణం’, ‘ గూఢాచారి’ మూవీలు ఉంటాయి. అయితే క్షణం మూవీ రిలీజై ఈ రోజుతో ఆరేండ్లు గడిచింది. ఈ సందర్భంగా ఆ మూవీ రిలీజ్ అయ్యే రోజు అడివి శేష్ ఎలా ఫీలయ్యాడో ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘ క్షణం మూవీ రిలీజై ఆరేండ్లు పూర్తైంయ్యింది. ప్రసాద్ స్క్రీనింగ్ లో 2016 ఫిబ్రవరి 26న ఉదయం 8:45 గంటలకు ‘క్షణం’తో జీవితం మారియిపోయింది.’ అంటూ పేర్కొన్నాడు. కొన్నేండ్ల తన కష్టానికి ఫలితం దక్కిందంటూ కొంత ఎమోషనలయ్యారు. క్షణం మూవీ ఆరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీలో అదా శర్మ (Adah Sharma), అనసూయ భరద్వాజ్ (Anasuya), వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మంచి కలెక్షన్స్ ను సాధించింది. అనేక అవార్డులకు కూడా నామినేట్ అయింది. క్షణం చిత్రానికి గాను శేష్ ఉత్తమ స్క్రీన్ ప్లేకి IIFA అవార్డు మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును గెలుచుకున్నాడు.

ప్రస్తుతం అడివి శేష్ ‘మేజర్’(Major) చిత్రంలో నటిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితానికి సంబంధించిన బయోపిక్ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించారు. మే 27న తెలుగు, మలమాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి శశి కిరన్ తిక్క దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేశ్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శేష్ స్పై థ్రిల్లర్ చిత్రం గూఢాచారికి సీక్వెల్ అయిన ‘గూఢాచారి 2’కి స్క్రిప్ట్ రాస్తున్న విషయం తెలిసిందే. అలాగే విశ్వక్ సేన్ నటించిన HIT:ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్ అయిన హిట్ 2 : ది సెకండ్ కేస్‌లో నటించడానికి కూడా శేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు