ఇస్రో రికార్డ్ సృష్టిస్తే సాయి ధరమ్ తేజ్ కు ఏంటి

First Published 15, Feb 2017, 8:48 AM IST
winner sai dharamteja tweet on isro
Highlights
  • రోదసిలోకి 104 ఉపగ్రహాలను పంపి అరుదైన రికార్డు సాధించిన ఇస్రో
  • 100కు పైగా శాటిలైట్లను లాంచ్ చేయడంపై ఇస్రోకు థ్యాంక్స్ చెప్పిన సాయిధరమ్
  • కాఫీ పెట్టినంత ఈజీగా సాధించినందుకు ఆనందంగా ఉంద సాయి ధరమ్ తేజ్ ట్వీట్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకత ఉందని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటాడు. అన్ని అంశాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకునే సాయి ధరమ్ తేజ్ ఇటీవల తన సినిమా ఓపెనింగ్ కు ఎన్టీఆర్ ను అహ్వానించి అటెన్షన్ క్రియేట్ చేశాడు. ఇక సోషల్ అంశాలపై కూడా సాయిధరమ్ తేజ్ తనదైన శైలిలో స్పందిస్తాడు.

 

ఇటీవల రాష్ట్రంలోని అనాధలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత విద్య, వసతి ఏర్పాటు చేయాలని తీసుకొన్న నిర్ణయంపై కూడా మెగా మేనల్లుడు ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలా సాంఘిక అంశాలపై కూడా తరచూ స్పందిస్తూ... తెలుగు ప్రజల మనసులు గెలుస్తున్న విన్నర్ గా నిలుస్తున్నాడు.

 

తాజాగా రోదసిలోకి 104 ఉపగ్రహాలను పంపి ఇస్రో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన నేపథ్యంపై 'విన్నర్' స్పందించారు. '100కు పైగా శాటిలైట్లను లాంచ్ చేయడం మాకు కాఫీ పెట్టినంత ఈజీ అని రుజువు చేసిన ఇస్రోకు థ్యాంక్స్. భారతీయులందరిని గర్వపడేలా చేసినందుకు ఆనందంగా ఉంది' అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇస్రో సక్సెస్ భారతీయుల సక్సెస్. మరి భారతీయుడు స్పందించాడు. అంతటి దేశభక్తి ఉంది కాబట్టే.. సాయిధరమ్ తేజ్ స్పందించాడు. ఇదే కదా దేశభక్తి అంటే. సాయి ధరమ్ తేజ్ గొప్ప దేశభక్తుడు కాబట్టే ఇస్రోను అభినందించాడు. ఏదైనా మనసులో ఉంటేనే కదా స్పందించేది.

loader