హీరో కూతురితో లిప్ లాక్ కి యంగ్ హీరో ప్లాన్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 12, Aug 2018, 11:15 AM IST
will young hero adivi sesh kiss rajasekhar's daughter
Highlights

రొమాంటిక్ ఇంటిమేటెడ్ సీన్స్ లో శివానీ నటించడం పట్ల రాజశేఖర్ అభ్యంతరం తెలుపుతున్నారు. శివానీ నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో ఎక్కువగా గ్లామర్ సీన్స్ లో చేయడం హీరో కూతురిగా తన ఇమేజ్ దెబ్బ తింటుందనేది రాజశేఖర్ భావన

'క్షణం', 'గూఢచారి' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఈ రెండు సినిమాలకు అతడు కథ అందించడం విశేషం. ఈ రెండు సినిమాల్లో అడివి శేష్ లిప్ లాక్ సీన్స్ లో నటించాడు. ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవ్వడంతో దాన్ని సెంటిమెంట్ గా భావిస్తూ తన తదుపరి సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ ఉండేలా చూడమని దర్శకనిర్మాతలకు చెబుతున్నాడట.

దీంతో రాజశేఖర్ కూతురు శివానీతో కలిసి అడివి శేష్ నటిస్తోన్న సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'టు స్టేట్స్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఒరిజినల్ సినిమాలో లిప్ లాక్స్ ఉన్నాయి కాబట్టి తెలుగులో కూడా రిపీట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై జీవిత రాజశేఖర్ దంపతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

రొమాంటిక్ ఇంటిమేటెడ్ సీన్స్ లో శివానీ నటించడం పట్ల రాజశేఖర్ అభ్యంతరం తెలుపుతున్నారు. శివానీ నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో ఎక్కువగా గ్లామర్ సీన్స్ లో చేయడం హీరో కూతురిగా తన ఇమేజ్ దెబ్బ తింటుందనేది రాజశేఖర్ భావన. దీంతో అడివి శేష్ సెంటిమెంట్ కి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. రాజశేఖర్ ని ఎలా ఒప్పించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది!  

loader