బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహారం బాలీవుడ్ పరిశ్రమలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ కలకలం సృష్టిస్తోంది.  ముఖ్యంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కంగనా మీద కూడా అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల కంగన దిష్టి బొమ్మలు కూడా దహనం చేస్తుండటంతో ఆమె తీవ్ర స్థాయిలో స్పందించింది. ముంబై పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ల కనిపిస్తుంది అంటూ కామెంట్ చేసింది.

అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన సహా అన్ని రాజకీయ పార్టీలు కంగన తీరును తప్పు బట్టాయి. మహారాష్ట్రను, అక్కడి ప్రజలను అవమానించేలా కంగన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కామెంట్ చేసింది కంగనా. అయితే కంగనా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటోంది. తనకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది. అయితే అలాంటి బెదిరింపులకు బయపడేది లేదన్న కంగనా తాను ఈ నెల 9న ముంబై వస్తున్నానని `దమ్ముంటే నన్ను ఆపండి` అంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు ముంబై ఎవడి అబ్బ సొత్తు కాదని మహారాష్ట్ర అభివృద్దికి కృషి చేసిన వారిదే ఈ రాష్ట్రమని చెప్పింది కంగనా. దీంతో సుశాంత్ సింగ్ కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఇక సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో అరెస్ట్‌లు మొదలయ్యాయి. రియా సోదరుడు షోవిక్‌ను నార్కోటిక్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే విచారణలో షోవిక్‌ డ్రగ్స్‌ కోనుగోలు చేసినట్టు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.