పది రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద “ఆర్ఆర్ఆర్” హవా ఏ మాత్రం తగ్గలేదు. డివైడ్ టాక్ ని కూడా ఈ సినిమా దాటేసి రెవిన్యూ రాబడుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” మేనియాలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి మాయలో పడి మండుటెండలను లెక్క చేయకుండా థియోటర్స్ ముందు క్యూలు కడుతున్నారు. పది రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద “ఆర్ఆర్ఆర్” హవా ఏ మాత్రం తగ్గలేదు. డివైడ్ టాక్ ని కూడా ఈ సినిమా దాటేసి రెవిన్యూ రాబడుతోంది. ఈ మేనియా తగ్గాలంటే మరికొంతకాలం గడవాల్సిందే. అయితే మరో నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ “గని” రూపంలో దిగుతున్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ ఊపు ముందు గని నిలబడగలడా అనేదే ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ అయ్యిపోయింది.
ఈ సినిమా కోసం వరుణ్ బాగా కష్టపడ్డారు. ట్రైలర్ కూడా బాగా క్లిక్ అయ్యింది. అయితే “ఆర్ఆర్ఆర్” ఆల్రెడీ వచ్చి పాతుకుపోయింది! “ఆర్ఆర్ఆర్” ని చూసిన కళ్ళతో, ఓ రొటీన్ రివేంజ్ స్పోర్ట్ డ్రామాను ప్రేక్షకులు చూడగలరా? అంటే కష్టమే అంటున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ని మరిపించి , ప్రేక్షకులను మెప్పించగలిగితే మాత్రం సక్సెస్ అయ్యినట్లే. మెగా కుటుంబం నుంచి వస్తున్న వరుణ్ కు ఈ సినిమా సక్సెస్ అత్యవసరం. ఈ “గని” అయినా వరుణ్ ట్రాక్ ను మారుస్తుందని ఎదురుచూస్తున్నాడు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తోందనటంలో సందేహం లేదు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో మా అన్నయ్య నిర్మాతగా మారుతున్నందుకు హ్యాపీ. ఇరవై ఏళ్ల అనుభవం ఆయనకుంది. వరుణ్ అంటే నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. సినిమాల్లోకి వచ్చాక తనపై రెస్పెక్ట్ కూడా వచ్చింది. తను సెలెక్ట్ చేసుకుంటున్న కథలు, అతని జర్నీ నన్ను గర్వపడేలా చేశాయి. ఇప్పటివరకు వరుణ్ నటించిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఈ సినిమా మరొక ఎత్తు. దీనికి తను పడ్డ కష్టం మామూలుది కాదు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. సినిమా చూశా. చాలా బాగా నచ్చింది’ అని చెప్పాడు.
వరుణ్‌తో ఏదో ఒకరోజు ‘కేజీయఫ్’ లాంటి సినిమా తీస్తానన్నారు అల్లు అరవింద్. ‘గని మూడేళ్ల కల. పవన్ కళ్యాణ్‌కి ‘తమ్ముడు’ సినిమా మైల్ స్టోన్ అయినట్టే, వరుణ్‌కి ‘గని’ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు కిరణ్ కొర్రపాటి. ఆనెస్ట్‌గా తీసిన ఈ మూవీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాతలు అల్లు బాబి, సిద్ధుముద్ద.
