ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. బాహుబలి తరువాత ఆయన నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా ఎంత వసూలు చేయగలదనే విషయంపై బిజినెస్ వర్గాలు అంచనాకి రాలేకపోతున్నాయి.

బాహుబలి సినిమాకి ఉన్న హంగులు ఈ సినిమాకి లేవు. ప్రభాస్ ఇమేజ్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బయ్యర్లు కూడా సినిమాలో భారీతనం, ప్రభాస్ ని చూసే సినిమాను కొంటున్నాడు. ఒక్క సీడెడ్ లో ఈ సినిమా పాతిక కోట్లు పలికిందంటే మామూలు విషయం కాదు.

దీన్ని బట్టి అమ్మకాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఇరవై కోట్లు, కర్ణాటకలో మరో ఇరవై కోట్లు వచ్చాయట. రెగ్యులర్ సినిమాలకు జరిగే బిజినెస్ కంటే ఇది రెండింతలు ఎక్కువే.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా ఏంటనేది తేలిపోనుంది.

ఆశించినట్లుగా ఈ సినిమా సక్సెస్ అయితే బయ్యర్లు పెట్టిన సొమ్ముకి రెండింతలు సంపాదించుకుంటారు. కానీ ఏవరేజ్ టాక్ వస్తే మాత్రం పెద్ద దెబ్బే.. ఈ మధ్యకాలంలో ఏవరేజ్ టాక్ వచ్చిన ఏ సినిమాకి వంద కోట్ల వసూళ్లు రాలేదు. మరి ప్రభాస్ ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా.. తన క్రేజ్ తో బయ్యర్లను ఒడ్డున పడేయగలడో లేదో.. చూడాలి!