‘రాధేశ్యామ్’ ని భారీగా టెమ్ట్ చేస్తున్న'జీ' గ్రూప్
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి సినీ పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం.. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. ఈ క్రమంలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్ని అయోమయంలో పడిపోయాయి. సినిమాలను రిలీజ్ లను అపే అవకాశం లేని చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నాయి. కానీ, భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల పరిస్థితి అలా లేదు. ఓటీటీలో విడుదల చేస్తే.. తమకు రావాల్సిన లాభాలు రావు. దీంతో ఈ సినిమాల విడుదలకు కొత్త విధానాన్ని వెతుక్కున్నాయి.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, దిశా పటానీ కాంబినేషన్‌లో ప్రభుదేవ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్’. గతేడాది నుంచి థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘రాధే’ మూవీని సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. ఈ చిత్రం జీప్లెక్స్‌లో పే పర్ వ్యూ విధానంలో విడుదల అయ్యింది. అదే రోజు కొన్ని చోట్ల మే థియేట్రికల్ రిలీజ్ చేసారు. ఈ సినిమా హిట్టా,ప్లాఫ్ అన్నది ప్రక్కన పెడితే..రిలీజ్ రోజు మాత్రం ఓ రేంజిలో వంద కోట్లు దాకా వచ్చాయని, అలాగే కొత్త సబ్ స్కైబర్స్ జీప్లెక్స్ కు పరిచయం అయ్యినట్లు సమాచారం. ఇప్పుడు ఇదే స్కీమ్ లో ప్రభాస్ చిత్రాన్ని సైతం ఇదే పద్దతిలో హైబ్రీడ్ రిలీజ్ చేద్దామని జీ వాళ్లు అదిరిపోయే ప్రపోజల్స్ పెడుతున్నారట. ఆ ప్రపోజల్స్ చాలా టెమ్టెంగ్ గా ఉటున్నాయట. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్ ఖడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్ రాయ్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం!