Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కి సవాల్ విసురుతున్న ఆ హీరో... నాన్ రాజమౌళి మూవీతో బీట్ చేయగలడా?

ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి 2 ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఈ రికార్డు సోలోగా ప్రభాస్ కి దక్కదు. రాజమౌళి బ్రాండ్ నేమ్ కూడా ఉంది. నాన్ రాజమౌళి మూవీతో ఓ హీరోని బీట్ చేయడం ఇంత వరకు ప్రభాస్ వల్ల కాలేదు. 
 

will prabhas beat yash kgf 2 collections with kalki 2829 AD ksr
Author
First Published Jul 6, 2024, 7:25 PM IST


బాహుబలి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు ప్రభాస్. ముఖ్యంగా బాహుబలి 2 దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అయితే బాహుబలి 2 సక్సెస్ ని సోలోగా ప్రభాస్ కి కట్టబెట్టలేం. అందులో రాజమౌళి బ్రాండ్ నేమ్ కూడా ఉంది. బాహుబలి 2 తర్వాత విడుదలైన చిత్రాలు ఆ విషయం స్పష్టం చేశాయి. 

సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాలు బాహుబలి 2 దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. కాగా రాజమౌళి సహాయం లేకుండానే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు కన్నడ హీరో యష్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ 2 భారీ వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 డొమెస్టిక్ కలెక్షన్స్ రూ. 1000 కోట్ల వరకు ఉన్నాయి. ఇక హిందీ వెర్షన్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

యష్ కెజిఎఫ్ 2తో నెలకొల్పిన రికార్డ్స్ ని ప్రభాస్ కల్కితో బ్రేక్ చేయగలరా అనే చర్చ నడుస్తోంది. చూస్తుంటే అంత సులభం కాదనిస్తుంది. అసాధ్యం మాత్రం కాదు. ఆల్రెడీ కల్కి వరల్డ్ వైడ్ రూ. 800 కోట్ల వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్ రూ. 150 కోట్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ ని బీట్ చేయడం కష్టమే. మరో రెండు వందల కోట్లకు పైగా కల్కి వసూలు  చేయాల్సి ఉంది. 

కాగా ఈవారం కూడా కల్కి చిత్రానిదే. జూన్ 12న భారతీయుడు 2 విడుదలయ్యే వరకు కల్కి కి పోటీ లేదు. హిందీలో కూడా స్టార్ హీరోల చిత్రాలేవీ విడుదల కావడం లేదు. ఈ వీకెండ్ కల్కి గట్టిగా రాబడితే కెజిఫ్ 2 రికార్డుకి దగ్గరవుతుంది. మరి చూడాలి నాన్ రాజమౌళి మూవీతో కెజిఎఫ్ 2 ని ప్రభాస్ బీట్ చేస్తాడేమో. నాగ్ అశ్విన్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి తెరకెక్కించాడు.నిర్మాత అశ్వినీ దత్ రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె ఇతర ప్రధాన పాత్రలు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios