‘లైగర్’ లో మైక్ టైసన్.. నిజమా?

 విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ‘లైగ‌ర్’ అనే సినిమా రూపొందుతుంద‌నే సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో మైక్ టైస‌న్ న‌టిస్తాడంటూ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. 

Will Mike tyson act in Liger movie? jsp

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం “లైగర్”. ఈ  సినిమా పై ఎప్పటికప్పుడు అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి, తాజాగా ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించాలని అందుకే  ఆ పాత్ర కోసం అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకున్నారని వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలో ఎంత వాస్తవం ఉంది అనేది తెలియటం లేదు.

అయితే ఇందులో నిజం ఉంది అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 'లైగర్‌' సినిమాలో క్యామియో అప్పియరెన్స్‌ ఇచ్చేందుకు ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్ సీన్ లోకి వచ్చారు అంటున్నారు. ఆయనతో కలిసి బాక్సర్‌ మైక్‌టైసన్‌ను ఒప్పించేశారని చెప్పుకుంటున్నారు.కరణ్ తలుచుకుంటే ఇలాంటివి జరగటంలో వింతేముంది అంటున్నారు. ఈ వార్త నిజమైతే లైగర్‌కు స్పెషల్‌ ఎలిమెంట్‌గా మైక్‌ టైసస్‌ ప్రత్యేక ఆకర్షణ అవ్వనున్నారనటంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. అయితే ఏ విషయం క్లారిటీగా తెలియాలంటే..అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.
 
ఇక ఇప్పటికే ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న విజయ్‌ క్రేజీ మేకోవర్‌తో లైగర్‌ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు.  ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios