ఒక భాషలో ఓ సినిమా హిట్టైతే మిగతా భాషల వాళ్లు రీమేక్ రైట్స్ కోసం వాలిపోతారు. ప్రతీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల రిజల్ట్ లు గమనిస్తూ, రైట్స్ కోసం రంగంలోకి దిగుతూంటారు ఈ రీమేక్ నిర్మాతలు. ఇప్పుడు మజిలీ చిత్రం రీమేక్ పై వేరే భాషల నిర్మాతల దృష్టి పడింది. 

అక్కినేని నాగచైతన్య.. సమంతా.. దివ్యాన్ష కౌశిక్  హీరో హీరోయిన్లుగా నటించిన 'మజిలి' రిలీజ్ అయి  రెండు వారాలుపైగా  అయింది.  మొదటి షోనుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచి ఇప్పటికి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ లు చూస్తోంది.   సమ్మర్ హాలిడేస్ ను.. పోటీలో ఇతర సినిమాలు లేకపోవడంతో వచ్చిన అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకున్న ఈ సినిమా ఈ వారం మాత్రం చిత్రలహరితో పోటీ పడుతోంది. 

చిత్రలహరి బ్లాక్ బస్టర్ అయ్యితే పరిస్దితి ఎలా ఉండేదో కానీ యావరేజ్ హిట్ కావటంతో మజిలికు ఎదురేలేకపోయింది.  మొదటి వారంలోనే బయ్యర్లను లాభాల్లోకి తీసుకొచ్చిన ఈ చిత్రం ఇప్పుడు రీమేక్ బాటలోకి ప్రయాణం పెట్టుకుంది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మళయాళ , తమిళ రైట్స్ కు బేరసారాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ తమిళ నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకుని ధనుష్ తో చేయిస్తే బాగుంటుందని ఎప్రోచ్ అవ్వాలని ప్లానింగ్ లో ఉన్నాడని తమిళ మీడియాలో గుప్పుమంది.  అయితే తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందనేది నాగార్జున ఆలోచనగా చెప్తున్నారు. సమంత తమిళంలో స్టార్ హీరోయిన్ కాబట్టి , ఎలాగో హిట్ సినిమా కాబట్టి అక్కడే ఆడే అవకాసం ఉందని, ఆ విధంగా తన కొడుక్కి తమిళ మార్కెట్ ఈజీ అవుతుందని నాగ్ ఆలోచనగా చెప్తున్నారు. అయితే నిర్మాత మాత్రం రీమేక్ రైట్స్ ఇచ్చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.