అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేస్తోన్న 'బిగ్ బాస్'  జనరంజకంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేకపోతోందంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం డల్ కంటెంటే అనేది తెలిసిన విషయమే. వివాదాలు కన్నా గోల ఎక్కువగా ఉంటోంది. టీవి సీరియల్ లా సాగుతోందని కొందరంటున్నారు. ఈ నేపధ్యంలో షోకు బూస్ట్ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకోసం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే నాని, రమ్యకృష్ణ ఈ షోలో సెపరేట్ గా కనపడి ఫెరఫార్మ్ చేసారు. నాగ్ బదులుగా రమ్యకృష్ణ ఈ షోని నడిపించారు కూడా. చాలా స్పెషల్ గా ఉందీ ఎపిసోడ్. అలాగే నాని తన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కోసం ఈ షో కు వచ్చారు. ఈ రెండు సందర్బాల్లో టీఆర్పీలు బాగున్నాయి. ఈ విషయం గమనించిన షో డిజైనర్స్..మరో పెద్ద స్టార్ ని తీసుకువచ్చి ఒక్కసారిగా షోకు క్రేజ్ ని రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వారు రకరకల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టీమ్ ప్లాన్ చేస్తున్న వారిలో ఒకరు చిరంజీవి అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కనుక బిగ్ బాస్ స్టేజీపై కనపడితే ఆ కిక్కే వేరు. ఆ రోజు టీఆర్పీలు మామూలుగా ఉండని అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున ప్రయత్నాలు మొదలెట్టారట. సైరా ప్రమోషన్ కోసం చిరుని ఈ షో కు నాగ్ ఆహ్వానిస్తున్నారట. ఇక నాగ్ కు చిరంజీవికి మధ్య మంచి రిలేషన్ ఉంది. అంతేకాదు మాటీవిలో గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ని చిరంజీవి హోస్ట్ చేసారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవిని ఎలాగైనా ఈ షోకు రప్పించాలనే ప్లానింగ్ లో ఉన్నారట. మరి చిరంజీవి ఒప్పుకుంటారో లేదో చూడాలి.