బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌25వ రోజు  కిల్లర్‌ కాయిన్స్ పూర్తయి అత్యధిక కాయిన్స్ కలిగిన కుమార్‌ సాయి కెప్టెన్‌గా గెలుపొందాడు. ఇక ఈ షోలో ప్రధానంగా కాయిన్స్ దొంగలించాడనే కారణంతో సోహైల్‌, అమ్మ రాజశేఖర్‌కి మధ్య పెద్ద గొడవే జరిగింది. సోహైల్‌తో మాట్లాడనని, దేనికైనా మనసు ఉండాలని మాస్టర్‌ గట్టిగా వాధించాడు. 

ఇక 25వ రోజు రాత్రి పడుకునే ముందు అందరు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు. ఇందులోనూ అఖిల్‌, స్వాతి దీక్షిత్‌కి పులిహోర కలుపుతూనే ఉన్నాడు. వీరిపై లాస్య, సుజాత, దివి కామెంట్‌ చేసుకుంటూ నవ్వులు పూయించారు. 

ఇంతలో గంగవ్వ రెచ్చిపోయింది. ఫినిషింగ్‌ టచ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో గంగవ్వ శిగం ఊగించింది. సభ్యులపై, బిగ్‌బాస్‌లపై కామెంట్‌ ప్రశంసలు కురిపించింది. `మా పెద్దన్న బంగారం.. చిన్న అన్న వెండి అంటూ, అమ్మ రాజవేఖర్‌ సినిమా తీస్తాడు.. నాకు క్యారెక్టర్‌ ఇస్తాడు` అని చెప్పింది. దీంతో దీన్ని వారంతా బాగా ఎంజాయ్‌ చేశారు. 

అయితే రాత్రి సమయంలో కిచెన్‌ సమీపంలో హారిక సీతకోకచిలుకలు అంటూ ఉంటుంటే.. ఆమె వద్దకు అఖిల్‌ వచ్చి గట్టిగా వెనకాల నుంచి వాటేసుకుని గుడ్‌ నైట్‌ అంటూ వెళ్లిపోయాడు. దీంతో 25వ రోజు ఎపిసోడ్‌ పూర్తయ్యింది. అయితే నెక్ట్స్ ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది. బిగ్‌బాస్‌ అఖిల్‌ కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచాడు. మరి ఆయనకు ఏదైనా ఫనిష్‌మెంట్‌ వేస్తున్నాడా? ఇంతకి ఎందుకు పిలిచాడు? అఖిల్‌ ఉంటాడా? వెళ్ళిపోతాడా? అన్నది ఆసక్తినెలకొంది.