యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రెండు నెలలుగా బాలీవుడ్ ని కార్చిచ్చులా దహించి వేస్తుంది. వివాదం అంతకంతకూ పెరిగిపోతోందే కానీ తగ్గడం లేదు. ఓ ప్రక్క అధికారులు ఈ కేసులు విచారణలో తలమునకలై ఉండగా, సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం తమ ఆవేశాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సుశాంత్ మృతికి బాలీవుడ్ పెద్దలే కారణం అని నమ్ముతున్న సుశాంత్ ఫ్యాన్స్, కొందరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సుశాంత్ మరణంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రియా చక్రవర్తి, మహేష్ భట్ ఆమె కూతురు అలియా భట్ ఉందని గట్టిగా వారు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న విడుదలైన సడక్ 2 ట్రైలర్ పై తమ ఆక్రోశం, అలియాపై కోపాన్ని వెళ్లగక్కారు. 

మహేష్ భట్ దర్శకత్వంలో అలియా భట్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆ ట్రైలర్ పై నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఇక యూట్యూబ్ లో ఐతే డిజ్ లైక్స్ అనే ఆయుధం ఉపయోగించారు. వారు కోరుకున్నట్లు 24 గంటల వ్యవధిలోపే ప్రపంచంలోనే అత్యధిక డిజ్ లైక్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా రికార్డ్ నమోదు చేశారు. లక్షల మంది పనిగట్టుకొని మరీ సోషల్ మీడియాలో సడక్ 2 ట్రైలర్ ని ఏకిపారేశారు. సడక్ 2 ట్రైలర్ పై ఈస్థాయిలో నెటిజెన్స్ విరుచుకు పడగా, రేపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన తరువాత కూడా ఆ మూవీని చాలా మంది అవైడ్ చేసి, భారీ నష్టాలు మిగిల్చుతారేమో అనే సందేహం కలుగుతుంది.

ఈ నేపథ్యంలో అలియా భట్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ నిర్మాతల గుండెల్లో గుబులు మొదలైంది. చిన్నా చితకా చిత్రాల సంగతి సరే, ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్రంలో అలియా ప్రధాన హీరోయిన్ పాత్ర చేస్తుంది. మరి రేపు ఆర్ ఆర్ ఆర్ పై కూడా సుశాంత్ ఫ్యాన్స్, బాలీవుడ్ ప్రేక్షకులు ఇదే స్థాయిలో వ్యతిరేకత చూపిస్తే పరిస్థితి ఏమిటీ? అలాగే ఆర్ ఆర్ ఆర్ థియేటర్ రిలీజ్ మూవీ కావున, మరింత ప్రమాదం పొంచి ఉంది. ట్రైలర్స్, టీజర్స్ కి వారు డిజ్ లైక్స్  ఇచ్చినా పెద్దగా నష్టం లేదు. కానీ ఆర్ ఆర్ ఆర్ విడుదల అడ్డుకున్నా, సినిమా చూడకూడని అవైడ్ చేసినా భారీ నష్టాలు చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రాజమౌళి బాహుబలి చిత్రాలు బీహార్ లో భారీ వసూళ్ళు రాబట్టాయి. సుశాంత్ సింగ్ బీహార్ కి చెందినవారు. బీహార్ ప్రజలు పూర్తిగా అలియా నటించిన కారణంగా ఆర్ ఆర్ ఆర్ ని తిరస్కరించే అవకాశం ఎక్కువగానే ఉంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్న తరుణంలో వారు శాంతించాలని ఆశిద్దాం. లేదంటే ఆర్ ఆర్ ఆర్ కి ఎంతో కొంత లేదా భారీ నష్టం