టాలీవుడ్ టాప్ డైరక్టర్ వి వి వినాయక్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలను తన చుట్టు తిప్పుకున్న ఈ డైరెక్టర్ కి ఈ పరిస్థితి ఊహించనిదే. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసిన వినాయక్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టడం జరిగింది. మరి అలాంటి దర్శకుడిని టాలీవుడ్ టాప్ హీరోలు పక్కన పెట్టారా అనే డౌట్ కొడుతుంది. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో భారీ హిట్ వినాయక్ అందుకోవడం జరిగింది. తమిళ హిట్ చిత్రం కత్తి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. 

ఆ చిత్రం తరువాత వినాయక్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ అనే మూవీ చేశారు. ఆ మూవీ ఘోరపరాజయం పాలైంది. ఖైదీ నంబర్ 150కి ముందు అక్కినేని వారసుడు అఖిల్ ని పరిచయం చేస్తూ అఖిల్ మూవీ తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. వినాయక్ తెరకెక్కించిన రెండు స్ట్రైట్ చిత్రాలు విఫలం కాగా, ఖైదీ నంబర్ 150 రీమేక్ కావడంతో పాటు, చిరు కమ్ బ్యాక్ మూవీ కావడంతో ఆ హిట్ పూర్తిగా చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. 

దీనితో వి వి వినాయక్ ఫార్మ్ కోల్పోయారనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక వి వి వినాయక్ కి బాగా సన్నితుడైన ఎన్టీఆర్ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో అదుర్స్ 2 రానుందని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. చరణ్ మరియు చిరంజీవి మాత్రమే వి వి వినాయక్ కి అవకాశం ఇచ్చే ఆస్కారం కలదు. చరణ్ కి  వినాయక్ పట్ల అంతగా ఆసక్తి లేదని వినికిడి. దీనితో చిరంజీవిని బుట్టలో వేసుకొనే పనిలో వినాయక్ ఉన్నారట. వీరిద్దరూ బెంగుళూరులో కలిసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.