కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ శ్రుతిహాసన్‌ సైతం ఇప్పుడు వరుస షూటింగ్ లతో జోరు చూపిస్తోంది. ఈ లాక్‌డౌన్‌లోనే ‘పుతమ్‌ పుదు కాలై’ అనే వెబ్‌సిరీస్‌లో నటించిన ఆమె.. తాజాగా చెన్నైలో ‘లాభం’ షూటింగ్ లలో  పాల్గొంటోంది. మరో ప్రక్క రవితేజ ‘క్రాక్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల కోసం సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్  తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించటానికి సిద్దపడ్డ ఆమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు.తను చేస్తున్న సినిమా సెట్ నుంచి వాకవుట్ చేసారు. అందుకు కారణమేమిటనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాభం’ అనే తమిళ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. అయితే ఊహించనివిధంగా శ్రుతిహాసన్‌.. షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు.

అందుకు కారణం ..ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో షూటింగ్ జరిగే చోటుకి వచ్చారు. దీంతోప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా పరిస్థితుల కారణంగా సమూహాల్లో ఉండడం, తెలియని వాళ్లని కలవడం అంత  మంచిది కాదని శ్రుతి భావించారట.. దీంతో ఆమె షూటింగ్‌ మధ్యలోనే పేకప్‌ చెప్పేశారని అందరూ భావిస్తున్నారు. ఇక గత కొన్నిరోజుల క్రితం  శ్రుతిహాసన్‌.. ‘కొవిడ్‌-19 వల్ల ప్రతిఒక్కరీ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది!! అది ఇంకా అంతం కాలేదు. ప్రోటోకాల్స్‌ ఫాలో కాని తరుణంలో ఒక మహిళగా.. నటిగా జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది.!!’ అని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.