శ్రీకాంత్ అడ్డాల విలన్ గా చేయటానికి అసలు కారణం ఇదా?
శ్రీకాంత్ అడ్డాల ప్లే చేసే రోల్ పెద కాపు సినిమాకే హైలెట్ గా ఉంటుందంటూ యూనిట్ వర్గాల నుంచి సమాచారం.

టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. తన తాజా చిత్రం పెదకాపు తో పూర్తి స్దాయి నటుడుగా కనిపించబోతున్నారని రిలీజైన ట్రైలర్ తో హింట్ ఇచ్చారచు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. పెదకాపు-1 చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో రిలీజైన ట్రైలర్ పూర్తి రా అండ్ రస్టిక్ గా ఉంది. సినిమా కథ లోకల్ రాజకీయాలు, కమ్యూనిటీ గొడవల చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. అయితే ఇవన్నీ మామూలే అయినా సర్పైజ్ ఎలిమెంట్ మాత్రం ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ అడ్డాలే కనిపించటమే. అయితే ఆయన హఠాత్తుగా ఏదో గెస్ట్ రోల్ లో కాకుండా నటుడుగా ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. నేను ఆ పాత్ర కోసం ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఫైనల్ చేశాను. ఆయన కూడా ఆ రోల్‌లో నటించేందుకు అంగీకరించారు. తీరా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చూస్తే ఏమైందో తెలియదు కానీ ఆయన షూట్‌కు రాలేదు. అప్పటికప్పుడు ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏర్పాటు చేయడం కష్టం. మరోవైపు చాలా మంది ఆర్టిస్టులతో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. అప్పుడు నా అసోసియేట్ కిషోరే ఆ కేరెక్టర్‌చేయమని నన్ను ఒప్పించాడు.' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఆ టైమ్‌లో ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే.. అందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చాడు.
నాగబాబు(Nagababu), తనికెళ్ల భరణి, రావు రమేశ్(Rao Ramesh), రాజీవ్ కనకాల(Rajeev kanakala), ఈశ్వరీ(Eshwari), అనసూయ(Anasuya) కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నిర్మాత, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలై సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఫైట్స్ కంపోస్ట్ చేశారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు. రాజు సందరం కొరియోగ్రఫీ చేశారు.