దివంగత శ్రీదేవి బాలీవుడ్ లో 'సోల్వా సావన్' అనే సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో ఆమె నాలుగేళ్ల పాటు బాలీవుడ్ కి  దూరమయ్యారు. ఆ తరువాత 1983 లో శ్రీదేవి-జితేంద్ర కాంబినేషన్ లో తెరకెక్కిన 'హిమ్మత్‌వాలా' బాలీవుడ్ లో పెద్ద విజయాన్ని అందుకుంది.

రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాతో శ్రీదేవికి బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు లభించింది. అయితే ఆమెకి కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితమవ్వడం ఇష్టం లేదట. ఈ విషయాలను 'శ్రీదేవి క్వీన్ ఆఫ్ హార్ట్స్' పుస్తకంలో పొందుపరిచారు.

'హిమ్మత్‌వాలా' సక్సెస్ గురించి శ్రీదేవి ప్రస్తావిస్తూ.. ''తమిళ ప్రేక్షకులు నా సహజ నటనని ఇష్టపడతారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ వేరు. సద్మా(వసంతకోకిల రీమేక్) ఫ్లాప్ అయింది. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు నన్ను గ్లామరస్ రోల్స్ లో చూడాలని ఫిక్స్ అయిపోయారు.

అందుకే 'హిమ్మత్‌వాలా' సక్సెస్ ని దురదృష్టంగా భావిస్తాను. కానీ ఏదొకరోజు నాలోని నటనాపటిమని ప్రదర్శించే చాన్స్  వస్తుందని'' ఆమె అన్నట్లు శ్రీదేవి పుస్తకంలో పేర్కొన్నారు.