సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. ఆమె ఎందుకు సూసైడ్‌ చేసుకుంది. ఆమె భర్త చెన్నైలో ఎందుకు ఉన్నాడనేది అనుమానాలకు తావిస్తుంది.   

స్టార్‌ సింగర్‌ ఆత్మహత్యాయత్నం టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేస్తుంది. ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. సంగీత ప్రియులను షాక్‌కి గురి చేస్తుంది. వివాద రహితంగా ఉండే కల్పన సడెన్‌గా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఆశ్చర్యంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం సింగర్‌ కల్పనని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆమె రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాని సింగర్ కల్పన

దీంతో నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్‌లోని కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు డోర్‌ కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో డోన్‌ని బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా, బెడ్‌పై కల్పన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. బెడ్‌పై కొన్ని టాబ్లెట్లు కూడా ఉన్నాయి.

దీన్ని బట్టి ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఆమెని వెంటనే స్థానికి ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె ఇంకా స్పృహలోకి రానట్టు తెలుస్తుంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో కల్పనకి ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని పోలీసులు తెలిపారు.  

సింగర్‌ కల్పన భర్త ఇంట్లో ఎందుకు లేడు? చెన్నైకి ఎందుకు వెళ్లాడు..

ఇదిలా ఉంటే కల్పన ఆత్యహత్యాయత్నం ఎందుకు చేసింది? ఆమె లైఫ్‌లో ఏం జరిగిందనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. తన భర్తతో కలిసి నిజాంపేటలోని తన ఇంట్లో నివాసం ఉంటుంది  కల్పన. కానీ రెండు రోజుల క్రితమే భర్తతోపాటు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లిపోయారని, అప్పటి నుంచి కల్పన ఒక్కరే ఇంట్లో ఉంటున్నారని స్థానికుల నుంచి తెలుస్తుంది.

రెండు రోజులుగా ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దీంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రెండు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉండటం, కనీసం తమ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడం అనేక కొత్త అనుమానాలకు తావిస్తుంది. తన భర్త ఆమెకి ఫోన్‌ చేయలేదా? ఆయన ఎందుకు స్పందించలేదు? అనేది అనుమానంగా మారింది.   

సింగర్‌ కల్పన భర్త ప్రసాద్‌పై పోలీసులు అనుమానం.. ఫ్యామిలీ గొడవలేనా?

మరోవైపు కల్పన భర్త ప్రసాద్‌ ప్రభాకర చెన్నైకి ఎందుకు వెళ్లారు? మిగిలిన ఫ్యామిలీ ఏమయ్యారు అనేది మరింత సస్పెన్స్ గా మారింది. పోలీసులు కల్పన భర్త ప్రసాద్‌కి సమాచారం ఇవ్వడంతో ఆయన చెన్నై నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో కల్పనని పరామర్శించిన అనంతరం పోలీసులు ప్రసాద్‌ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్‌ వ్యాన్‌లోనూ ప్రసాద్‌ అనుమానాస్పదంగా కనిపించారు. ఆయన కెమెరాలకు చిక్కకుండా ముఖానికి చేతిని అడ్డుపెట్టుకున్నారు. దీంతో ఇది మరింత అనుమానం క్రియేట్‌ చేస్తుంది. కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఆమె భర్తనేనా అనే అనుమానం కలుగుతుంది. 

రిఫ్రెష్‌ టాబ్లెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్లే సింగర్‌ కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లిందా?

ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? ఆమె భర్తకి, తనకు గొడవలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కల్పన భర్తని విచారిస్తున్నారు. ఆయన నుంచి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. భర్త పోలీసులకు చెప్పిన సమాచారం మేరకు కల్పన రిఫెష్‌మెంట్‌ కోసం కొన్ని మాత్రలు వాడుతుందని, వాటి డోస్‌ పెరగడంవల్ల ఇది ఏమైనా జరిగిందా అని పోలీస్‌ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.

అయితే దీనిపై ఆయన కూడా పూర్తి సమాచారం ఇవ్వలేదు. కల్పన గురించిన వార్త తెలిసి సింగర్లు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే సింగర్‌ సునీత, గీతా మాధురీ, సింగర్‌ శ్రీకృష్ణ వంటి వారు ఆసుపత్రికి చేరుకుని కల్పనని పరామర్శించారు. ఇదిలా ఉంటే కల్పన గతంలోనూ సూసైడ్‌ అటెంప్ట్ చేసిందని తెలుస్తుంది. అంతేకాదు తన సన్నిహితుల వద్ద కూడా ఈ విషయాన్ని వెల్లడించిందని, వాళ్లు ఎంతో నచ్చచెప్పారని, ధైర్యాన్నిచ్చారని సమాచారం. 

red  more: ప్రముఖ స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌.. ఏం జరిగింది?

also read: 15 కేజీల బంగారంతో పట్టుబడ్డ కన్నడ హీరోయిన్‌.. అరెస్ట్!