తమిళ సీనియర్ నటుడు రాధారవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

తమిళ సీనియర్ నటుడు రాధారవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం నయనతార సినిమా ఫంక్షన్ కి అతిథిగా వెళ్లిన రాధారవి ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సినీ పరిశ్రమలో వివాదాస్పదంగా మారింది.

దీంతో అప్పుడు రాధారవి తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరారు. అయితే ఇప్పుడు మాత్రం నేనెందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ లఘు చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి రాధారవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ''నేను తప్పుగా మాట్లాడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటానని గతంలో చెప్పాను కానీ నేనెవరికీ క్షమాపణలు చెప్పలేదని'' అన్నారు. క్షమాపణలు చెప్పడం తన రక్తంలోనే లేదని.. అసలు నయనతార ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. నేనేమైనా క్షమించరాని నేరం చేశానా..? అంటూ ఫైర్ అయ్యారు.

''ఈరోజు నేను మాట్లాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆరోజు నయనతార గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే విధంగా చప్పట్లు కొట్టి అభినందించారు'' అంటూ చెప్పుకొచ్చాడు. నిజం మాట్లాడితే ప్రజలు తనకే మద్దతు పలుకుతారని అన్నారు. 

సినిమాల్లో నటించనని చాలామంది తనను బెదిరిస్తున్నారని.. తననెవరూ ఆపలేరని, సినిమాలు లేకపోతే నాటకాల్లో నటిస్తానని.. ఇదో పెద్ద సమస్యగా తనకు అనిపించడం లేదని అన్నారు.

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.