సారాంశం

  ఓ పెద్ద గనులు సెటప్, విలన్స్, కేజీఎఫ్ లో ఆధిపత్యపోరులు చూపించారు. ఇక్కడ సలార్  సినిమా  ఫస్టాఫ్ లో బొగ్గు గనులు,  సెకండాఫ్ లో ఖన్సార్ సామ్రాజ్యం అక్కడ ఆధిపత్య పోరు కనిపించింది. 

సలార్  సినిమా చూసిన చాలా మంది సెకండాఫ్ ని  కేజీఎఫ్ తో పోలుస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ పార్ట్ 1 ని చూసిన ఫీలింగే  కలుగుతోంది అంటున్నారు. నిజంగా ఈ రెండు సినిమాలకు పోలికలు ఉన్నాయా..ఉంటే అందుకు ప్రధాన కారణం ఏమిటో చూద్దాం. 

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూసిన సలార్ సినిమా వచ్చేసింది.  డిసెంబరు 22న అంటే ఈ రోజున ఉదయం ఒంటి గంటనుంచి  స్క్రీన్ మీద బొమ్మ మొదలైన క్షణం నుంచీ ...ఈ చిత్రం గురించి డిస్కషన్ మొదలైంది. ఈ సినిమా ఆల్రెడీ ఓపినింగ్స్ తోనే  ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా వెయిట్ చేయటమే అందుకు కారణం. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఓ రేంజ్ లో ఈ సినిమాపై హైప్ పెరిగింది. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ ఖాన్సార్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతోందని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది. దాంతో ఆ ఖన్సార్ రాజ్యం ఏమిటో చూద్దామని జనం బయిలు దేరారు. అదే సమయంలో కేజీఎఫ్ కు సలార్ కు కనెక్షన్ ఉంటుందంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత ఉంటుందో అని ఎదురూచూసారు. అలాగే  ఈ మూవీలో యశ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంతా భావించారు. డైరక్టర్ లేదు అని చెప్పినా ఆశపడ్డారు. అయితే ఈ సినిమా కథకు కేజీఎఫ్ కు అసలు సంభందమే లేదు. అలాగే యశ్ ఈ సినిమాలో లేరు. అయితే కేజీఎఫ్ తో కథ పరంగా కొన్ని పోలికలు అయితే కనపడ్డాయి.

ఈ రెండు సినిమాల్లోనూ తల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఉంది. అదీ ఆ తల్లి పాత్ర వేసిన ఈశ్వరరావు కావటంతో కేజీఎఫ్ అని అనిపించింది. అలాగే కేజీఎఫ్ లో ఓ పెద్ద కోట, విలన్స్, కేజీఎఫ్ లో ఆధిపత్యపోరులు చూపించారు. ఇక్కడ  ఈ సినిమా సెకండాఫ్ లో ఖన్సార్ సామ్రాజ్యం అక్కడ ఆధిపత్య పోరు కనిపించింది. కేజీఎఫ్ తో గానీ, కేజీఎఫ్ యూనివర్స్ తో గానీ సలార్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అందులో విలన్స్ కూడా ఇందులో విలన్స్ గా కనపడ్డారు. 
 
సలార్ అయినా, కేజీఎఫ్ అయినా అందరూ గమనించిన ఓ కామన్ విషయం ఉంది. అది వీటిలోని డార్క్ థీమ్. కేజీఎఫ్ రెండు పార్ట్ లు చూసిన వాళ్లు సలార్  చూడగానే అచ్చూ ఆ సినిమాల్లాగే అనిపిస్తోందే అనుకుని ఉంటారు.  మరీ ముఖ్యంగా కేజీఎఫ్ లో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సామ్రాజ్యం.. ఇప్పటి సలార్ లోని ఖాన్సార్ సామ్రాజ్యం దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. ఓ డార్క్ థీమ్ లో విజువల్స్ కనిపిస్తాయి. హీరోలు, విలన్లు కూడా అచ్చూ కేజీఎఫ్ లో ఉన్నట్లే ఉన్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయని అర్దం చేసుకోవాలి.  ప్రశాంత్ నీల్ గతంలో తీసిన ఉగ్రం, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలన్నీ ఇలాంటి థీమ్ తోనే ఉంటాయి.