ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని దర్శకధీరుడు రాజమౌళి సోమవారం మీట్‌ అయ్యారు. ఆయన సీఎంని కలిసిన కారణం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఏపీలో టికెట్ల సమస్య పరిష్కారమైంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. ఆశించిన స్థాయిలో భారీగానే పెంచింది. తక్కువగా రూ.20 నుంచి 250 వరకు థియేటర్లు, ఏరియాలు, సీటింగ్‌ని బట్టి నిర్ణయించింది. భారీ సినిమాలకు పది రోజులపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. చిన్న సినిమాలకు ఐదో షోకి గ్రీన్‌ సిగ్నల్‌తోపాటు, కచ్చితంగా ఒక్క షో చిన్న సినిమాలకు కేటాయించాలని తేల్చి చెప్పింది. 

ఈ నేపథ్యంలో తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` దర్శకుడు రాజమౌళి సోమవారం ఏపీ సీఎం జగన్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. మార్చి 25న `ఆర్‌ఆర్‌ఆర్‌` భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ని రాజమౌళి ఎందుకు మీట్‌ అయ్యారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న రాజ‌మౌళి, దాన‌య్య అనంత‌రం అక్క‌డి నుంచి తాడేప‌ల్లిలోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు.

మొదట సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిని మీట్‌ అయిన రాజమౌళి, దానయ్య అనంతరం సీఎంని కలిశారు. అయితే వీరిమధ్య ఈ నెల 25న విడుదల కాబోతున్న`ఆర్ఆర్ఆర్` సినిమాకి సంబంధించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కోసం ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని సీఎం జగన్‌ని రాజమౌళి కోరారట. అలాగే సినిమా టిక్కెట్లు ధరల అంశంపై రాజమౌళి చర్చించారు. టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటుని ఇవ్వాలని కోరినట్టు టాక్‌. రాజమౌళి పాటు సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ స్థాయి కలెక్షన్లు రికవరీ కావాలంటే మామూలు విషయం కాదు. అందుకే టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని, మరోవైపు ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటుని కల్పించాలని కోరారని తెలుస్తుంది. మరి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించారు.