ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ తాజా చిత్రం చెక్. ఈ సినిమా ప్రమోషన్స్ వారం ముందు నుంచే జోరుగా మొదలయ్యాయి. అయినా ఎక్కడా రకుల్ కనపడలేదు. నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ లు చెక్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ మాత్రం చెక్ ప్రమోషన్స్ లో కనిపించకపోవటం అందరికీ ఆశ్చర్యం వేసింది. దాంతో రకుల్ కి చెక్ సినిమాలో క్యారక్టర్ నచ్చలేదా? నితిన్ తో డ్యూయెట్స్ కానీ తన పాత్రకి ప్రాధాన్యత కానీ లేదని ఫీలయ్యి చెక్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందా? అనే అనుమానం అందరిలోనూ మొదలయ్యింది. చివరికి  హైదరాబాద్ లో జరిగిన చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రకుల్ కనపడలేదు. 

దానికి తోడు చెక్ సినిమాలో ఒక డ్యూయెట్ లేకుండా.. సీరియస్ పాత్రలో రకుల్ చెయ్యడం అందిరికీ షాకింగ్ విషయం.  ఒక కమర్షియల్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి సినిమా రకుల్ ఒప్పుకోవడం  షాకింగ్ విషయం అనడంతో నిజంగానే రకుల్ ఫీలవుతుంది అని అనుకుంటున్నారు అంతా. కానీ రకుల్ ప్రీత్ మాత్రం తాను చెక్ ప్రమోషన్స్ అంటే చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోవడానికి తాను ముంబై షూటింగ్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదని.. సారి చెబుతూ చెక్ సినిమా 26 న రిలీజ్ అవుతుంది అందరూ చూడండి అంటూ సోషల్ మీడియాలో చెక్ చెప్పింది. అయితే ప్రమోషన్స్ కు కూడా రాలేనంత బిజి ఏమి కాదని, డైరక్టర్ కు ఆమెకు చెడిందని మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

ఈ సినిమాలో చేసిన ప్రియ ప్రకాష్ వారియర్ కు ఓ పాట ఉంది కానీ, రకుల్ కు మాత్రం అదీ లేదు. అసలు ఈ సినిమాలో పాటలు లేవని చెప్పిన దర్శకుడు ఆ తర్వాత ప్రియా ప్రకాష్ కు పాట పెట్టడం రకుల్ ని బాధించింది అంటున్నారు.

మరో ప్రక్క రకుల్ తన స్క్రీన్ ప్రజెన్స్ పై అంతగా సంతృప్తిగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తన కంటే ప్రియా వారియర్ కే ఎక్కువగా మార్కులు పడుతున్నాయని ఆమె హర్ట్ అయిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈమె ప్రమోషన్స్ కు దూరంగా ఉండటం వెనక అసలు కారణం కూడా ఇదే అంటున్నారు.  హిందీ సినిమాలతో రకుల్ బిజీగా ఉండటం వల్లే ఇక్కడ చెక్ ప్రమోషన్స్ కు రాలేకపోతుందని చిత్ర యూనిట్ సర్ది చెప్తున్నారు. కారణమేదైనా కూడా చెక్ ప్రమోషన్స్ సమయంలో మాత్రం రకుల్ ఎవ్వరికీ కనిపించడం లేదు.