Asianet News TeluguAsianet News Telugu

‘ఆది పురుష్‌’ ఓకే చేయటం వెనక జరిగింది ఇదీ

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’ అనే చిత్రంలో నటించనున్నారు ప్రభాస్‌. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు జరుగుతన్నాయి. అయితే ఇంత హఠాత్తుగా ప్రభాస్ ఈ సినిమా ఓకే చేయటం వెనక జరిగిన కథేంటి..

why  Prabhas accept Adipurush movie?
Author
Hyderabad, First Published Aug 27, 2020, 8:09 AM IST

రీసెంట్ గా  ప్రభాస్‌ మరో ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్రకటించారు. ఇది ఆయన కెరీర్‌ లో 22వ చిత్రం. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్‌’ అనే ఫ్యాంటసీ చిత్రంలో హీరోగా నటించనున్నారు ప్రభాస్‌. చెడు పై మంచి ఎలా విజయం సాధించింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో శ్రీ రాముడి పాత్రలో కనిపిస్తారు ప్రభాస్‌. అయితే హఠాత్తుగా ఈ ప్రాజెక్టు ఓకే చేయటం వెనక ప్రభాస్ ఆలోచన ఏమిటనేది సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. 

వాస్తవానికి ప్రభాస్ ...ఈ బాలీవుడ్ బ్యానర్ టీ సీరిస్ లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా సినిమా చేయాల్సి ఉంది. అయితే సందీప్ వంగా వినిపించిన కథ ..క్రైమ్ , మాఫియా తో కూడి ఉండటం, రీసెంట్ గా సాహో చేయటంతో అలాంటి సినిమా చేయాలనుకోవటం లేదు ప్రభాస్. దాంతో కథ బాగున్నా...ప్రస్తుతం తాను రెండు అర్బన్ మూవీస్ చేస్తున్నానని, రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సినిమాలు అర్బన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతాయని చెప్పారట.

 అయినా తాను బాహుబలిని మించే ఎపిక్ సినిమా చేయాలనుకుంటున్నట్లు వివరించారట. దాంతో సందీప్ వంగా తప్పుకున్నారు. అప్పుడు అలాంటి కథ రెడీ చేస్తున్న దర్శకుడు ఓం రౌత్‌ సీన్ లోకి వచ్చారు. ఆయన వచ్చి మొదట క్యారక్టర్, ఆ తర్వాత తాను స్క్రీన్ ప్లే చేసిన విధానం చెప్పగానే ప్రభాస్ మరో మాట ఆలోచించకుండా ఈ దర్శకుడు డైరక్ట్ చేసిన తానాజీ సినిమా తెప్పించుకుని చూసారట. వెంటనే ఓకే చెప్పేసి, ఎనౌన్సమెంట్ ఇచ్చేసారని సమాచారం.

ప్రభాస్‌ మాట్లాడుతూ – ‘ప్రతీ పాత్రకు ఒక్కో ఛాలెంజ్‌ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నేను చేయబోయే పాత్రకు ఛాలెంజ్‌ తో పాటు చాలా బాధ్యత కూడా ఉంది. ఇలాంటి పాత్ర దొరకడం గర్వంగానూ ఉంది. ఓం ఈ సినిమాను అద్భుతంగా డిజైన్‌ చేశాడు’’ అన్నారు. 

బాలీవుడ్‌ నిర్మాతలు భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్లనుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమా 3డీలో కూడా విడుదలవుతుందట.

Follow Us:
Download App:
  • android
  • ios