Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..? ఇప్పుడిదే హాట్ టాపిక్!

రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పార్టీకి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. ఎన్టీఆర్ మాత్రం గైర్హాజరు అయ్యారు. 
 

why ntr skipped his rrr buddy ram charan birthday party ksr
Author
First Published Mar 28, 2023, 2:15 PM IST

ఎన్టీఆర్-రామ్ చరణ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఆర్ ఆర్ ఆర్ కి ముందే వీరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. తరచుగా కలుసుకునేవారు. సతీసమేతంగా కలిసి వేడుకలు జరుపుకునేవారు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రమోషన్స్ లో వీరి సాన్నిహిత్యం చూసి మెగా-నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతారు. రామ్ చరణ్ అయితే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు. నా బ్రదర్ ఎన్టీఆర్ స్నేహాన్ని ఎప్పటికీ వీడేది లేదని పబ్లిక్ లో పరోక్షంగా చెప్పారు. 

చరణ్ కి అంత గొప్ప మిత్రుడైన ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు రాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్ విదేశాల్లో ఉండి లేక షూటింగ్ లో బిజీగా ఉండి రాలేదంటే అర్థం ఉంది. ఆయన హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. సతీసమేతంగా హాజరు కావాల్సిన ఎన్టీఆర్ ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతుంది. 

why ntr skipped his rrr buddy ram charan birthday party ksr

రామ్ చరణ్ కి సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన ఎన్టీఆర్ బర్త్ డే పార్టీకి మాత్రం డుమ్మా కొట్టాడు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ క్రెడిట్, ఫేమ్, నేమ్ విషయంలో ఏమైనా మనస్పర్థలు చోటు చేసుకున్నాయా? ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యాక ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ ఒక అనారోగ్యపూరిత వాతావరణం క్రియేట్ చేశారు. మావాడు గొప్పంటే మావాడు గొప్పంటూ సోషల్ మీడియాలో కొట్టుకున్నారు. 

ఫ్యాన్స్ రచ్చను హీరోలు పట్టించుకోరు. వారి ఆలోచనలు ఫాలో అవుతారని మనం అనుకోకూడదు. కాబట్టి చరణ్ బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ రాకపోవడాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని కొందరి వాదన. వ్యక్తిగత కారణాలతో రాకపోయి ఉండొచ్చంటున్నారు. కాగా రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి రాజమౌళి, కీరవాణి, నాగ్, అఖిల్, చైతు, విజయ్ దేవరకొండ, వెంకీ, రానా, ప్రశాంత్ నీల్... తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో బర్త్ డే బాయ్ చరణ్ తో పాటు భార్య ఉపాసన ప్రత్యేకంగా నిలిచారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios