చాలా కాలం తరువాత నందమూరి ఫ్యామిలీలో ఓ పెళ్లివేడుక జరిగింది. ఎన్టీఆర్ పెద్దకుమారుడు జయకృష్ణ కుమారుడైన చైతన్య కృష్ణ వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకకు నందమూరి ఫ్యామిలీ నుండి అందరూ హాజరయ్యారు. బాలకృష్ణ భార్య వసుంధర మరియు కొడుకు మోక్షజ్ఞతో పెళ్ళికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే కళ్యాణ్ రామ్ సైతం వేడుకకు సతీసమేతంగా హాజరు కావడం జరిగింది. కాగా ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. అనగా ఆయన ఈ పెళ్లివేడుకు హాజరు కాలేదు. సొంత పెదనాన్న కొడుకు వివాహానికి ఎన్టీఆర్ హాజరు కాకపోవడం ఆలోచించాల్సిన విషయమే. 

షూటింగ్ హడావుడిలో ఎన్టీఆర్ రాలేకపోయారని సరిపెట్టుకోవాడనికి, ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం. ఒకవేళ టౌన్ లో ఎన్టీఆర్ లేకున్నా కనీసం తన తరపున భార్య పిల్లలను పంపి ఉండవచ్చు. కానీ ఈ పెళ్ళికి ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒక్కరు కూడా వెళ్లలేదని సమాచారం. కుటుంబంలో జరిగిన వేడుకకు ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదనేది ఆసక్తికరంగా మారింది. 
మరో వైపు ఎన్టీఆర్ వేడుకలకు దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతుంది. 

ఇటీవల నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకగా  ఘనంగా జరిగింది. పరిశ్రమకు చెందిన టాప్ స్టార్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్, చరణ్ అందరూ హాజరుకావడం జరిగింది. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే దిల్ రాజు బర్త్ డే పార్టీలో పాల్గొనలేదు. కోవిడ్ నేపథ్యంలో ఎన్టీఆర్ వేడుకలకు దూరంగా ఉంటున్నారా, మరో కారణం ఉందా అనేది అర్థం కావడం లేదు.