అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ బంపర్ హిట్. హోస్ట్ గా డెబ్యూ షోతో బాలయ్య దుమ్మురేపాడు. ఈ ఊపులో సీజన్ 2 వచ్చేస్తుందంటూ నిర్వాహకులు హింట్ ఇచ్చారు. అయితే ఎందుకో ఆ ఊసే లేకుండా పోయింది.
ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షో ఓ సంచలనం. ఆ షో సక్సెస్ వెనుక సింహ భాగం బాలయ్యదే. ప్రారంభానికి ముందు అందరూ పెదవి విరిచారు. హోస్ట్ బాధ్యతలు బాలయ్య వల్ల కాదన్నారు. అప్పటికే సమంత హోస్ట్ గా సామ్ జామ్ ఆహాలో అట్టర్ ప్లాప్ అయ్యింది. సీరియస్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్య హోస్ట్ గా సక్సెస్ కావడం జరగదని భావించారు. అంచనాలు తలకిందులు చేయడమే తన పని అని బాలయ్య మరోసారి నిరూపించారు. ఫార్మాట్ కి భిన్నంగా వివాదాలు ప్రస్తావిస్తూ టాప్ సెలెబ్రిటీలతో సాగిన ప్రతి ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది.
ఆహా కు కాసులు కురిపించడంతో పాటు అన్ స్టాపబుల్ షో నేషనల్ వైడ్ మారుమ్రోగింది. మరి ఇంత సక్సెస్ ఫుల్ షో సెకండ్ సీజన్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆహా వాళ్ళు కూడా హడావుడి చేశారు. సీజన్ 2 వచ్చేస్తుందని ప్రోమోలు విడుదల చేశారు. త్వరలో సీజన్ స్టార్ట్ అవుతుందని ప్రేక్షకులు ఆశపడ్డారు. కారణం తెలియదు కానీ అనూహ్యంగా ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. అదే టైం లో బాలయ్య కోవిడ్ బారిన పడడం వలన షూటింగ్ ఆగినట్లు కథనాలు వెలువడ్డాయి.
బాలయ్య కోవిడ్ నుండి కోలుకొని నెలలు గడుస్తుంది. అయినా ఎలాంటి సమాచారం లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ తన 107వ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్య లుక్ తో పాటు విడుదలైన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై అంచనాలున్నాయి.
