అక్కినేని నాగార్జున కెరీర్ లో సెన్సేషన్ చిత్రం 'శివ'. 1989లో రిలీజైన ఈ చిత్రం  పలు రికార్డులను సృష్టించింది. తెలుగు సినిమాలను 'శివ' తర్వాత, ముందు అని విభజించే స్థాయికి ఈ చిత్రం చేరింది.  ఈ చిత్రాన్ని కొంతకాలం క్రితం ఐదు కోట్ల రూపాయలతో సరికొత్త సాంకేతిక హంగులను జోడించి, మళ్లీ రీ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. ట్రైలర్స్ కూడా రెడీ చేసారు. అయితే అర్దాంతరంగా సినిమా రీ రిలీజ్ ఆగిపోయంది. ఎందుకనేది ఎవరికీ అర్దం కాలేదు. ఏం జరిగిందో తెలియక నాగ్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు.

ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ... శివ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ పై చాలా వరకూ ఎవరో కాఫీ చల్లినట్లుగా మచ్చలు వచ్చాయి. . దీంతో ఆ రిలీజ్ ఆగిపోయింది' అని ఆయన చెప్పుకొచ్చారు.. నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాల ఒరిజినల్స్‌ కూడా మిస్‌ అయ్యాయి.‌ అని అన్నారు అక్కినేని నాగార్జున.  ఎందుకైనా మంచిది అని నేను నటించిన ఎవర్‌గ్రీన్ చిత్రాలు గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య, హలోబ్రదర్‌ హార్డ్ డిస్క్‌లు చెక్ చేశాను. వాటిని డీవీడీ, హార్డ్‌డిస్క్‌లో ఉంచాను కానీ. ప్రింట్‌ సరిగ్గా రావట్లేదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు. 

ఇలా  పాత కాలం నాటి సినిమాలు చూడాలంటే వాటికి సంబంధించిన ప్రింట్స్ దొరకకపోవచ్చు. దొరికినా వాటిలో చాలా వరకు పాడైపోయి ఉంటాయి. అందుకే ఆయా సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను ఒక్కచోట దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ ఏర్పాటు చేసారు. దాని పేరే  ‘ప్రిజర్వేషన్, రిస్టోరేషన్‌'. 

నాగ్ మాట్లాడుతూ...   ‘ప్రిజర్వేషన్, రిస్టోరేషన్‌' గురించి ఒక సందర్భంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన సతీమణి జయా బచ్చన్ నాకు వివరించారు. ‘తమ సినిమాలను ఈ పద్దతి ద్వారానే స్టోర్ చేసుకుంటామని, మీరు కూడా అలాగే చేయమని వాళ్లు నాకు చెప్పారు. ఇక, అప్పటి నుంచి ఇది ప్రారంభించాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో భాగంగానే ఈ వర్క్‌షాప్ ప్రారంభిస్తున్నాను. ఇందులో నాన్న గారి సినిమాలతో పాటు నావి కూడా స్టోర్ చేసుకుంటాను' అని నాగ్ వెల్లడించాడు.