ఆ మధ్యన కొన్ని నెలల క్రితం నాగచైతన్య, పరుసరామ్ కాంబనేషన్ లో ఓ ప్రాజెక్టు అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. అయితే షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. చైతు ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారు. అలాగే నాగార్జున ఆ స్క్రిప్టు విని కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అంతా బాగానే ఉంది. మరికొద్ది రోజుల్లో అనుకున్న ప్రకారం రెగ్యులర్ షూట్ కు వెళ్దామనుకునే లోగా దర్సకుడు పరుశరామ్ వచ్చి...తనకు మహేష్ తో సినిమా ఓకే అయ్యిందని, కాబట్టి చైతుతో చెయ్యడం కష్టమని అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను అని తేల్చి చెప్పాడట. 

తన కొడుకు చైతూతో సినిమా లాంచ్ చేసిన విషయం తెలిసినా పరుశరామ్ తో సినిమా ని మహేష్ ఓకే చేయటం ఏమిటని నాగ్ మండిపడుతున్నట్లుగా ఫిల్మ్ నగర్  సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. పరుశరామ్ చెప్పిన నేరేషన్ నచ్చితే...చైతూ సినిమా తర్వాత మనం ముందుకు వెళ్దాం అనాలి కానీ , ఇలా చేయటం భావ్యం కాదని నాగ్ భావిస్తున్నారట. నాగార్జున ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారని అంటున్నారు. గీతా గోవందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తన తదుపరి చిత్రం తన కొడుకుతో చేస్తే ఆ క్రేజ్ వేరే విధంగా ఉంటుందని భావిస్తే ఇలా చేసేడేంటి అనుకుంటున్నారుట. 

అయితే ఇందులో డైరక్టర్ ని బ్లేమ్ చేయటానికి ఏమీ లేదని అంటున్నారు. ఓ పెద్ద హీరో డేట్స్ ఇచ్చి సినిమా చేయమన్నప్పుడు అన్నీ వదులుకుని ఎవరైనా వెళ్తారని, అందులోనూ మహేష్ వంటి సూపర్ స్టార్ తో సినిమా అంటే ఎవరైనా ఉత్సాహం ఉంటుందని చెప్తున్నారు. అయితే మహేష్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే సిట్యువేషన్ లో లేడట. తను పరుశరామ్ తో ప్రాజెక్టు చెయ్యాలా లేక భీష్మ దర్శకుడుతో ముందుకు వెళ్లాలా అనే డైలమోలో ఉన్నాడట.