షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవుతుందని అన్నాను. అయినా నా మాట ఎవరూ వినలేదు. మొదట నాకు కథ చెప్పేటప్పుడు భారీ సెట్టింగ్ ఉంటుందని చెప్పారు.
హిట్,ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు హీరో నాగశౌర్య. అయినా సరే గత కొంతకాలంగా ఫ్లాపులు అతడిని వెంటాడుతున్నాయనేది నిజం. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సినిమాలు సైతం డిజాస్టర్ అవటం అతన్ని ప్రస్టేషన్ కు గురిచేసింది. దాంతో ఈసారైనా హిట్టు కొట్టాలన్న ఉద్దేశంతో ‘రంగబలి’ తో రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకులకు ముందుకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న శౌర్య తన సినిమాలకు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తన సినిమాల్లో చాలామంది జోక్యం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
నాగశౌర్య మాట్లాడుతూ..‘ మొన్నామధ్య మధ్య ఒక సినిమా చేశాను. దానికోసం నా శరీరంలో భారీగా మార్పులు తెచ్చుకున్నాను. ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. ఆ సినిమా మొదట్లో చెప్పిన విధంగా కాకుండా చాలా మార్పులు జరిగాయి. షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవుతుందని అన్నాను. అయినా నా మాట ఎవరూ వినలేదు. మొదట నాకు కథ చెప్పేటప్పుడు భారీ సెట్టింగ్ ఉంటుందని చెప్పారు. షూటింగ్ కి వెళ్లేసరికి చాలా మార్పు కనిపించింది. నాకు అప్పుడే తేడాగా అనిపించి ఇలా అయితే సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పాను. నేను చెప్పినట్టే ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాలో బయట వ్యక్తి జోక్యం చేసుకున్నాడని తెలిసింది. అలా ఇంతకుముందు కూడా ఓ సినిమాకి అలాగే జరిగింది. ఇలా సలహాలు ఇచ్చే వారివల్ల సినిమాలు నాశనం అవుతాయి’ అని వాపోయాడు.
ఈ కామెంట్స్ విన్నవాళ్లకు నాగశౌర్య ఎంత కోపంగా ,ప్రస్ట్రేషన్ తో ఉన్నాడో అర్దమవుతోందని అంటున్నారు. అయితే మరి ఏ సినిమాని అతను ముందే ఫ్లాఫ్ అవుతుందని ఊహించాడో అని చర్చిస్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకునేదాని ప్రకారం..ఆ సినిమా మరోదో కాదు లక్ష్య. నాగశౌర్య కండలు పెంచి ఎంతో కష్టపడి చేసిన ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాని ఉద్దేశించే ఆ కామెంట్స్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఆ సినిమానో కాదో ..నాగశౌర్య మాత్రమే చెప్పగలరు.
