గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య గ్యాప్ పెరిగింది. చాల రోజుల తర్వాత తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు మోహన్‌బాబు (Mohanbabu) కలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్‌బాబు.. దాదాపు గంటకుపైగా చర్చించుకున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరి భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. కొన్ని మీడియాలలో తాజా రాజకీయాలపై వీళ్లిద్దరూ చర్చించుకున్నారని వచ్చాయి. మరికొంతమంది మోహన్ బాబు ...త్వరలో తెలుగుదేశంలో జాయిన్ కాబోతున్నారని అని ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు కారణం వేరే ఉందంటున్నారు.
వాస్తవానికి ...తన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య గ్యాప్ పెరిగింది. చాల రోజుల తర్వాత తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇప్పుడు చంద్రబాబుని కలవటం వెనక ఆధ్యాత్మిక కారణం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిసరాల్లో తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణలో సాయిబాబా ఆలయం నిర్మించారు మోహన్ బాబు. ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించేందుకే ఆయన నివాసానికి వెళ్లారట మంచు మోహన్ బాబు. ఏదేమైనా ఈ భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం అయింది. ఈ మేరకు ఓ ఇన్విటేషన్ కార్డ్ ని ఆయన ఇచ్చారు.
సినిమాల విషయానికి వస్తే... మోహన్ బాబు, ఆయన కుమార్తె - విలక్షణ నటి మంచు లక్ష్మీ ప్రసన్న తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ రూపొందించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. రెండు నెలలు ఏకధాటిగా షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
"నాన్నతో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. వచ్చే రెండు నెలలు ఒత్తిడి తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇంతకు మునుపెన్నడూ చూడని పాత్రల్లో మోహన్ బాబు, లక్ష్మి మంచు కనిపిస్తారని చిత్రబృందం అంటోంది.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డైమండ్' రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.
