‘గ్యాంగ్‌ లీడర్‌’ విడుదలై ఈ ఏడాదితో సుమారు 32 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో చిత్ర టీమ్  దీన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసింది.


రీరిలీజ్ ల ట్రెండ్ లో ఈ సారి చిరు చిత్రం ముందుకు వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఒకప్పటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘గ్యాంగ్‌లీడర్‌’ (GangLeader) రీరిలీజ్‌ కు రెడీ చేసారు. అయితే ఇప్పుడు అనుకోని విధంగా వాయిదా పడింది. ఇప్పటి టెక్నాలిజీకు అనుగుణంగా 4కే వెర్షన్‌లోకి ‘గ్యాంగ్‌లీడర్‌’ను సిద్ధం చేయగా.. ఫైనల్‌ అవుట్‌పుట్‌ విషయంలో చిత్ర టీమ్ అసంతృప్తిగా ఉందని.. అందుకే ఈ సినిమా రీరిలీజ్‌ వాయిదా పడిందని చెప్తన్నారున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

అయితే సోషల్ మీడియాలో మాత్రం మరో విధంగా ప్రచారం జరుగుతోంది. సినిమాకు అనుకున్న స్దాయిలో బజ్ రాలేదని, ఓపినింగ్స్ కూడా వస్తాయనిపించలేదని,కాస్తంత పబ్లిసిటీ చేసి, ప్యాన్స్ ని ఉత్సాహపరిచి సినిమాని రిలీజ్ చేస్తే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చి వాయిదా వేసారని చెప్పుకున్నారు. అయితే ఇవన్నీ ఆధారం లేని వార్తలని ఈ వార్తలపై మెగా అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా దీన్ని రీరిలీజ్‌ చేయాలని కోరుతున్నారు.

‘చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్ఫాడించేస్తా’ అనే మాస్‌ డైలాగ్‌లతో మెగాస్టార్‌ చిరంజీవి ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించి చిరంజీవి కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్ చిత్రంగా నిలిచింది. చిరంజీవి యాక్షన్‌కు రావుగోపాలరావు, ఆనందరాజ్‌ విలనిజం తోడవడంతోపాటు మురళీమోహన్‌, నిర్మలమ్మ వంటి సీనియర్‌ నటులతో ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. ఓవైపు యాక్షన్‌, క్రైమ్‌ సీక్వెన్స్‌తో సాగుతూనే మరోవైపు విజయశాంతి, చిరు మధ్య కెమీస్ట్రీ, ప్రేమ పాటలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. 

సుప్రీమ్ హీరోగా ఉన్న చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చిన సినిమాల్లో ఇది కూడా ఉంది. మాస్‌, కమర్షియల్‌ హంగులతో విజయ బాపినీడు దీన్ని తెరకెక్కించారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’ విడుదలై ఈ ఏడాదితో సుమారు 32 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో చిత్ర టీమ్ దీన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 11న ఈసినిమా రీరిలీజ్‌ ముహూర్తం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇది వాయిదా పడినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.