Asianet News TeluguAsianet News Telugu

‘మహానాయకుడు’: అవుట్ డేటెడ్ కంటెంటే కొంపముంచుతుందా?

మహానాయకుడుపై ఎలాంటి ఎక్సపెక్టేషన్స్  క్రియేట్ చెయ్యడం లేదు బాలయ్య టీమ్.   మహానాయకుడు ట్రైలర్ విడుదలయ్యాక ఏదైనా అద్భుతం జరుగుతుందనుకున్న నందమూరి అభిమానులకు నోట మాట రాలేదు.

why Mahanayakudu reducing the interest
Author
Hyderabad, First Published Feb 21, 2019, 7:59 AM IST

మహానాయకుడుపై ఎలాంటి ఎక్సపెక్టేషన్స్  క్రియేట్ చెయ్యడం లేదు బాలయ్య టీమ్.   మహానాయకుడు ట్రైలర్ విడుదలయ్యాక ఏదైనా అద్భుతం జరుగుతుందనుకున్న నందమూరి అభిమానులకు నోట మాట రాలేదు. అంత సాదాసీదాగా ఉంది  ట్రైలర్. దానికి తోడు ఎటువంటి హడావిడి లేకుండా మహానాయకుడు ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్.

సినిమా ఈ శుక్రవారమే విడుదలకు సిద్దమవుతున్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏదీ చెయ్యలేదు. కథానాయకుడు మీద భీభత్సమైన అంచనాలు పెరిగి.. సినిమా తుస్సుమనిపించింది. అందుకే ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’ కావాలనే బజ్ లేకుండా చేసేసారనే టాక్ నడుస్తోంది. 

దానికి తోడు  మహానాయకుడు ట్రైలర్ లో సినిమా మొత్తం ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావు మధ్యనే నడిపించినట్లుగా కనబడుతుంది. నాదెండ్ల భాస్కర్ రావునే విలన్ చేశారు బాలయ్య, క్రిష్. అయితే ఈ కాలానికి అది ఎవరికీ ఇంట్రస్ట్ లేని అవుట్ డేటెడ్ కంటెంట్. దాంతో ఎక్కడా ఈ ట్రైలర్ హాట్ టాపిక్ గా మారలేదు. 

తాజాగా విడుదలైన మహానాయకుడు ట్రైలర్ తో నాదెండ్ల మళ్లీ హాట్ టాపిక్ అవ్వటం తప్ప ఒరిగిందేమీ లేదు. నాదెండ్ల కూడా లైట్ తీసుకున్నారో ఏమో కాని హానాయకుడుపై విమర్శలు చేయడం కానీ.. తన క్యారెక్టర్ గురించి వ్యతిరేకత వ్యక్తం చెయ్యడం కానీ చెయ్యడం లేదు.

నాదెండ్ల మాట్లాడుతూ... ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయంలో చంద్రబాబుది ఎటువంటి పాత్ర లేదని, ఆయనదేమీ తప్పులేదని, అందులో కేవలం తన పాత్రే ఉందని, పడిపోయిన పార్టీని బాబు నిలబెట్టాడని ఆ కుటుంబం ఉద్దేశమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం తంటాలు పడుతున్న క్రమంలోనే ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీశారని వ్యాఖ్యానించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios