Asianet News TeluguAsianet News Telugu

Ram Charan: గ్లోబల్ స్టార్ ట్యాగ్ వాడని రామ్ చరణ్... భయమా? గౌరవమా?

ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. అయితే ఈ ట్యాగ్ వాడేందుకు రామ్ చరణ్ ఇష్టపడటం లేదనిపిస్తుంది. 
 

why hero ram charan not used global star tag in game changer poster ksr
Author
First Published Mar 27, 2023, 6:05 PM IST

ఆర్ ఆర్ ఆర్ హీరోలను గ్లోబల్ స్టార్స్ అని పిలుస్తున్న విషయం తెలిసిందే. చెప్పాలంటే ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల సోషల్ మీడియా వార్లో భాగంగా ఈ ట్యాగ్స్ పుట్టుకొచ్చాయి. నందమూరి-మెగా హీరోల అభిమానులు ఒకరికొకరు పోటీగా తమ హీరోలను గ్లోబల్ స్టార్స్ అంటూ ఆకాశానికి లేపారు. ఇక ఆస్కార్ కి ముందు రామ్ చరణ్ అమెరికాలో సందడి చేశారు. ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోకి ఆహ్వానించబడ్డారు. ఆ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో అయ్యారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ 'స్పాట్ లైట్' అవార్డుతో సత్కరించింది. అవార్డ్స్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు కావాలని ఆహ్వానం పంపింది. 

అమెరికన్ మీడియాకు రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అన్నింటికీ మించి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలిచింది. ఈ విజయంలో రామ్ చరణ్ పాత్ర కూడా ఉంది. ఈ క్రమంలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ బిరుదుకు అర్హుడే అని అభిమానుల వాదన. ఇవాళ చాలా మంది అదే ట్యాగ్ తో రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే ఆ ట్యాగ్ అధికారికంగా వాడుకునేందుకు చరణ్ ఇష్టపడలేదు. గేమ్ ఛేంజర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్ వాడారు. 

బిరుదులు మార్చుకోవడం పెద్ద మేటరేం కాదు. అల వైకుంఠపురంలో విజయం తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ బిరుదు ఇచ్చారు. ఆయన దాన్ని హ్యాపీగా వాడేసుకుంటున్నారు. చరణ్ మాత్రం గ్లోబల్ స్టార్ ట్యాగ్ తన పేరుకు ముందు తగిలించుకునేందుకు వెనకాడారు. దీనికి కారణాలు అన్వేషిస్తే... రాజమౌళి సినిమాల సక్సెస్ క్రెడిట్ హీరోలకు దక్కదు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ విజయం నావల్లే అనే ఇద్దరు హీరోల్లో ఎవరూ చెప్పుకోలేరు. జనాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటారు. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఆయన ఎంచుకున్నారు కాబట్టి వాళ్లకు ఆ ఫేమ్ వచ్చింది. లేదంటే మరో ఇద్దరు హీరోలు ఆస్కార్స్ లో సందడి చేసేవారని కొందరి వాదన. అదే సమయంలో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వాడుకోవాలంటే కనీసం పాన్ ఇండియా హిట్ కొట్టాలి. ఆర్ ఆర్ ఆర్ మినహాయించి ఎన్టీఆర్ కొరటాల మూవీతో, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ఆ ఫీట్ సాధించాలి. వాస్తవంగా ఆర్ ఆర్ ఆర్ హీరోలు గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి ఇంకా చాలా దూరంలో ఉన్నారు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. కాబట్టి ఆ ట్యాగ్ అధికారికంగా తగిలించుకునే సాహసం చేయరని టాలీవుడ్ వర్గాల బోగట్టా... 

Follow Us:
Download App:
  • android
  • ios