సీజన్ ప్రారంభం నుండి దాదాపు ప్రతిసారి ఎలిమినేషన్స్ కి నామినేట్ అవుతూ వచ్చారు మోనాల్. ఎన్నిసార్లు నామినేటైనా ప్రతిసారి ఆమె సేవ్ అయ్యారు. రెండు మూడు వారాలకే చాప చుట్టేస్తుందనుకున్న మోనాల్ టాప్ సెవెన్ కి దూసుకొచ్చింది. హౌస్ లో అఖిల్, అభిజిత్ లతో రొమాన్స్ చేస్తూ, వారిద్దరి మధ్య మనస్పర్థలకు కారణం అవుతూ హౌస్ ని ఆసక్తికరంగా మార్చుతున్న కారణంగా, బిగ్ బాస్ ఆమె హౌస్ లో కొనసాగేలా చేస్తున్నాడనే అపవాదు కూడా ఉంది. 

ఈ వారం కూడా బిగ్ బాస్ మోనాల్ ని సేవ్ చేశాడు. అఖిల్, అరియనా, అవినాష్ మరియు మోనాల్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉండగా నిన్న ఎపిసోడ్ లో నాగార్జున మోనాల్ సేవ్ అయినట్లు తెలియజేశారు. దీనితో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అవినాష్, అఖిల్ మరియు అరియనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని కాదని, మోనాల్ కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు ముందుగా ఆమెను సేవ్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

రికార్డు స్థాయిలో ఓట్లు వచ్చాయని నాగార్జున చెవుతున్నా, ఓటింగ్ విధానంపై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చ నడించింది. ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయని, కొందరు కామెంట్ చేశారు. ఓటింగ్ విషయంలో పారదర్సకత లేకపోవడంతో షోపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే, ఈ సీజన్ ఎలిమినేషన్స్ విషయంలో దుమారం రేగింది. షో రేటింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు.