Alia Bhatt: అలియా భట్ కు RRR భారీ షాక్,అందుకే ఆ డెసిషస్?
రిలీజ్ కు ముందు డిల్లీ ప్రమోషన్స్ లో తప్ప కనపడలేదు. అలాగే సినిమా రిలీజ్ తర్వాత ట్వీట్ కూడా చేయలేదు. ఈ విషయం RRR అభిమానులకు బాధ కలిగిస్తోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమె సైలెన్స్ గా ఉండటమే మంచిదని అంటున్నారు. ఎందుకిలా జరిగింది అంటే... RRRలో అలియాభట్ కు సరైన ప్రయారిటీ లేకపోవటమే అని చెప్తున్నారు.
సాధారణంగా ఓ పెద్ద సినిమా అది ప్యాన్ ఇండియా రిలీజైనప్పుడు అందులో నటించిన ఆర్టిస్ట్ లు సినిమాను ప్రమోట్ చేస్తారు. అదే సమయంలో తమను తాము ప్రమోట్ చేసుకునే పోగ్రామ్ పెట్టుకుంటారు. అయితే అలియా భట్ మాత్రం RRR కు దూరం అంటోంది. దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. రిలీజ్ కు ముందు డిల్లీ ప్రమోషన్స్ లో తప్ప కనపడలేదు. అలాగే సినిమా రిలీజ్ తర్వాత ట్వీట్ కూడా చేయలేదు. ఈ విషయం RRR అభిమానులకు బాధ కలిగిస్తోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమె సైలెన్స్ గా ఉండటమే మంచిదని అంటున్నారు. ఎందుకిలా జరిగింది అంటే... RRRలో అలియాభట్ కు సరైన ప్రయారిటీ లేకపోవటమే అని చెప్తున్నారు. మరో ప్రక్క ఆమె ఇకపై ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు తన పాత్ర నిడివి,విషయాలపై ముందస్తు ఎగ్రిమెంట్ చేసుకోవాలని భావిస్తోందని బాలీవుడ్ మీడియా అంటోంది.
ఆర్.ఆర్.ఆర్ సినిమా మొన్న శుక్రవారం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపే చూసింది. అంతలా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై అటెంక్షన్ క్రియేట్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూడాలా అని తెలుగు ప్రేక్షకులే కాదు.. సినిమా విడుదలవుతున్న అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ ఆతృతగా ఉండటంతో ఓపినింగ్స్ అదిరిపోయాయి. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ దర్శక, హీరోలు సినిమాకు ప్రమోషన్స్ ఓ రేంజిలో చేసేసారు. వాటిల్లో అలియాభట్ పాల్గొంది తక్కువ. హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ ఫన్నీ టాక్ షో చేసినా హీరోయిన్ అలియా భట్ మాత్రం కనిపించలేదు. చిక్కబళ్లాపూర్ లో జరిగిన బిగ్గెస్ట్ ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీస్ ఈవెంట్ లోనూ ఆమె లేదు.
హీరోలతో సమానమైన ప్రమోషన్స్ అలియా కి ఇచ్చారు. డిసెంబర్ లో హిందీ ప్రమోషన్స్ అన్నిటిలోను, అన్ని లాంగ్వేజ్ ప్రెస్ మీట్స్ లో పాల్గొన్న అలియా సౌత్ వైపు చూడలేదు. అసలు అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ కి ప్లస్ అవుతుంది, నార్త్ లో భారీ క్రేజ్ వస్తుంది అని రాజమౌళి నమ్మి ఆమెని కీలకమైన సీత కేరెక్టర్ కి తీసుకున్నారు. సీత గా అలియా భట్ లుక్, ఆమె కేరెక్టర్, ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో అలియా భట్ వ్యవహరించిన తీరు అన్ని హైలెట్. కానీ ఆ తర్వాత ఆమె స్టార్ కిడ్ నెగెటివిటీని ఎదుర్కొంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెటిజెన్స్ నుండి అలియా భట్ తీవ్రమైన ద్వేషాన్ని చవి చూసింది.
దానితో అలియా నటించిన గంగూభాయ్ కతీయవాడి సినిమాలో అలియా భట్ నటనకు ప్రశంశలు వచ్చినా, విమర్శకుల సైతం అలియా భట్ నటనని పొగుడుతున్నా.. ఆ సినిమా కి క్రేజ్ రాలేదు. ఇప్పుడు RRR సినిమాలో అతి తక్కువగా ఆమె కనిపిస్తుంది. ఆమె పాత్రకు ప్రయారిటీ లేదు. ఆమెపై పాట కూడా లేదు. ఉందంటే ఉంది..లేదంటే లేదు అన్న పరిస్దితి. అలాంటప్పుడు ఆమె ఏం మాట్లాడగలదు అని ఆమె ప్యాన్స్ అంటున్నారు. RRRతో ఆమెకు బాలీవుడ్ లో గొప్పగా వెళ్లి సౌత్ సినిమాలో చేస్తే..ఏం ఒరిగిందని కామెంట్స్ అక్కడ మీడియాలో వినిపిస్తున్నాయి. అవన్నీ ఆమెను బాధపెట్టి ఉండచ్చు.