‘క్రాక్’ హిందీ రీమేక్..హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సంక్రాంతికు వచ్చిన సినిమాల్లో ఏది హిట్ అవుతుందో దాని రైట్స్ తీసుకుందామని కాసుకు కూర్చున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఆ క్రమంలో వారి దృష్టిని ఆకర్షించిన చిత్రం క్రాక్. అయితే క్రాక్ సినిమాకు ఆల్రెడీ కర్చీఫ్ వేసేసారని తెలిసి షాక్ అయ్యారట. ఇంతకీ ఆ సినిమా రైట్స్ ఎవరు తీసుకోబోతున్నారనే వివరాల్లోకి వెళితే...
హిట్టైన తెలుగు కథలు వరుసబెట్టి బాలీవుడ్‌కు ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, జెర్సీ, హిట్ వంటి సినిమా కథలన్నీ కూడా బాలీవుడ్‌కు వెళ్లాయి. ఇందులో అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్‌గా రీమేక్ అయ్యి హిట్ అవటంతో మరింత ఊపు వచ్చింది. దాదాపు మూడు వందల కోట్లు కొల్లగొట్టడంతో మన తెలుగు కథలకు మరింత గిరాకీ పెరిగింది. ఈ క్రమంలోనే మరి కొన్ని కథలు అక్కడికి వెళ్తున్నాయి. సంక్రాంతికు వచ్చిన సినిమాల్లో ఏది హిట్ అవుతుందో దాని రైట్స్ తీసుకుందామని కాసుకు కూర్చున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఆ క్రమంలో వారి దృష్టిని ఆకర్షించిన చిత్రం క్రాక్. అయితే క్రాక్ సినిమాకు ఆల్రెడీ కర్చీఫ్ వేసేసారని తెలిసి షాక్ అయ్యారట. ఇంతకీ ఆ సినిమా రైట్స్ ఎవరు తీసుకోబోతున్నారనే వివరాల్లోకి వెళితే...
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు క్రాక్ సినిమా రీమేక్ ని సోనూ సూద్ చేయాలని సంకల్పించారట. తనకు మారిన ఇమేజ్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. తెలుగు సినీ వర్గాల్లో తనకు ఉన్న పరిచయాలతో ఈ సినిమా రీమేక్ రైట్స్ లాక్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. సోనూ సూద్ స్వయంగా ఈ చిత్రం రైట్స్ తీసుకుని తనే హీరోగా రీమేక్ చేయబోతున్నారట. అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సోనూసూద్ హీరోగా తొలి చిత్రం ఇది అవుతుంది. హీరోగా లాంచ్ అవటం కోసం కొత్తగా విలన్ పాత్రలు ఏమీ కమిట్ కావటం లేదంటున్నారు.
ఇక ఈ చిత్రం కథ పోతురాజు వీర శంకర్ (రవితేజ) అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అనాథగా పెరిగి పోలీస్ అయిన అతను.. ఎవరైనా తన ముందుకొచ్చి బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడితే శివాలెత్తిపోయి... వాళ్లందరి తాట తీసేస్తుంటాడు. అలా ఒంగోలు ప్రాంతాన్ని ఏలుతున్న కఠారి కృష్ణ (సముద్రఖని) ని ఎలా టార్గెట్ చేసి, జైలు పాలు చేసారని కథ. ట్విస్ట్ లతో ఈ కథ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుంది.