Asianet News TeluguAsianet News Telugu

#PeddhaKapu1: మొదట ఆ మెగా హీరో తోనే చేద్దామనుకున్నారా?

. దాదాపు  1% రికవరీ కూడా కాకపోవటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. కొన్న బయ్యర్లు గోలెత్తిపోతున్నారు. సెటిల్మెంట్ అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Who is the first choice of  Pedda Kapu -1 ? jsp
Author
First Published Oct 4, 2023, 12:01 PM IST


బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత డైరెక్ట‌ర్‌ శ్రీకాంత్ అడ్దాల కెరీర్‌లో మ‌రో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన చిత్రం #PeddhaKapu. నిర్మాత బావమరిది విరాట్ క‌ర్ణా హీరోగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం శుక్రవారం  రిలీజ్ రోజు నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. మూడు రోజుల్లో ఈ సినిమా ముప్పై లక్షల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దాదాపు 12.5 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నిర్మాత‌ల‌కు దారుణంగా న‌ష్టాల‌ను మిగిల్చిన్న‌ట్లు స‌మాచారం. మొదటి వీకెండ్‌లోనే చాలా థియేట‌ర్ల నుంచి ఈ సినిమాను ఎత్తేశారు. కాన్సెప్ట్  గా బాగుందనిపించినా దానిని స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల త‌డ‌బ‌డ‌టంతో సినిమా ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు  1% రికవరీ కూడా కాకపోవటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. కొన్న బయ్యర్లు గోలెత్తిపోతున్నారు. సెటిల్మెంట్ అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఇంట్రస్టింగ్ స్నిప్పెట్ బయిటకు వచ్చింది.  

ఈ చిత్రం కథను శ్రీకాంత్ అడ్డాల మొదట మెగా హీరో  సాయి ధరంతేజ్ కి చెప్పారని తెలుస్తోంది. అయితే  కథ విన్నాక సాయి ధరంతేజ్ ఆలోచించి డెసిషన్ చెప్తానని అన్నారట. అయితే ఎంతకాలం ఉన్నా తేల్చలేకపోయేసరికి శ్రీకాంత్ అడ్డాల  కొత్త హీరోతో ఈ సినిమాని చేసేశారు. ఇప్పుడు రిజల్ట్ తేడా కొట్టాసింది. దాంతో ఓ డిజాస్టర్ ఫిల్మ్ లో  నటించాల్సిన సాయి ధరంతేజ్ కొద్దిలో తప్పించుకున్నారని అంటున్నారు. సాయి తేజ్ కథల విషయంలో సరైన టైమ్ కు సరైన డెసిషన్ తీసుకున్నాడని చెప్తున్నారు.

వాస్తవానికి మొదటి నుంచి  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే ఫ్యామిలీ సెంటిమెంటే. అయితే ఆయన  పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుని చేసిన విలేజ్ డ్రామా ఇది. చాలా బలమైన సామజిక అంశాన్ని స్పృశించినట్టు సీన్లు, డైలాగులు తో ట్రైలర్ వదిలారు. అలాగే ఒక కులాన్ని ఉద్దేసిస్తున్నట్లుగా  పెదకాపు టైటిల్ పెట్టడం కూడా ఉన్నంతలో సినిమాపై కొంత బజ్ క్రియేట్ కావటానికి కలిసివచ్చింది. అయితే అసలు సినిమాలో అసలు విషయంలేకపోవటం,బోర్ కొట్టేయటం, కొత్త హీరోపై అంత బరువు పెట్టేయడం డిజాస్టర్ కు కారణమైంది. 

స్టోరీ లైన్

అది 1980..  రాజమండ్రి దగ్గరలోని ఓ లంకగ్రామం.అప్పుడే అన్నగారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్తున్న సమయం. ఆ లంక గ్రామాన్ని ఇద్దరు పెత్తందార్లు లాంటి పెద్ద మనుష్యులు  సత్యరంగయ్య (రావు రమేష్) బయన్న (  అడుకాలం నరేన్) ఏలుతున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. తమ అధికారం కోసం ఎంతమందిని అయినా బలిపెట్టడానికైనా రెడీ అన్నట్లు ఉంటారు..అప్పుడప్పుడూ బలి పెడుతూంటారు. హింస వారి ఆయుధం. ఇక   పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నయ్యతో  కలిసి రావు రమేష్ దగ్గర అనుచరుడుగా పని చేస్తుంటారు. తన యజమాని  సత్యరంగయ్య కోసం  పెదకాపు అన్న జైలుకి వెళ్తాడు.  అయితే జైలుకు  వెళ్ళిన అతను మాయమైపోతాడు.  అతను ఏమయ్యాడు?  అప్పుడు అతని తమ్ముడు పెదకాపు...ఏం చేసాడు, సత్యరంగయ్య, బయన్న లపై ఎందుకు యుద్దం ప్రకటించాడు? ఆ తర్వాత సీన్ లోకి వచ్చిన  కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల)ఎవరు... సెకండాఫ్ లో కథను మలుపు  అక్కమ్మ ( అనసూయ)  పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios