మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. ఈ రోజు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. ఇప్పటికీ చీఫ్ గెస్ట్ ఎవరనేది తెలియలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

పవర్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పలు వాయిదా తరువాత ఈ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ రోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఈవెంట్ కారణంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగా అభిమానులు ఒకపక్క ఉత్సాహం ఉరకలేస్తోంది. మరోవైపు చీఫ్ గెస్ట్ ఎవరనే దానిపైనా ఆసక్తి నెలకొంది. దీంతో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ముగ్గురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

మొదట్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan) పేరు గట్టిగా వినిపించింది. కానీ తర్వాత సీఎం జగన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరైనా పెద్దలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

ఆచార్యలో దేవాలయ భూముల కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ల పాత్రల్లో చిరంజీవి, రామ్ చరణ్ కనిపించనున్నారు. వీరికి జంటగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అదిరిపోయే సంగీతం అందించారు. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి నిర్మాతలు వ్యవహరించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది.