కింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత రొమాంటిక్ అవతారం ఎత్తాడు. నాగార్జునకు మహిళల్లో ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2లో నటిస్తున్నాడు. 'హి లవ్స్ విమెన్' అనేది ఉపశీర్షిక. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మన్మథుడు 2 ఎలా ఉండబోతోందో అని. 17 ఏళ్ల క్రితం విడుదలైన మన్మథుడు చిత్రంలో మహిళలంటే ఇష్టం లేని వ్యక్తిగా నాగార్జున నటించాడు. మన్మథుడు 2లో మాత్రం రొమాంటిక్ వీరుడిగా రెచ్చిపోనున్నాడు. 

గురువారం రోజు మన్మథుడు 2 చిత్ర టీజర్ విడుదలయింది. రాహుల్ రవీంద్రన్ నాగార్జున పాత్రని ఫన్నీగా ప్రజెంట్ చేస్తూనే, కింగ్ ఈ చిత్రంలో ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నాడో శాంపిల్ చూపించాడు. అమ్మాయిలతో రొమాన్స్, నాగార్జున తనదైన శైలిలో చెప్పే డైలాగులు చాలా ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. 

టీజర్ లో ఇద్దరు అందమైన భామలతో నాగార్జున లిప్ లాక్స్ తో రెచ్చిపోయి నటిస్తాడు. కానీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో మాత్రం చూపించలేదు . రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కానీ టీజర్ లో వారి జాడే లేదు. మరి నాగార్జునతో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరూ ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. 

కన్నడ బ్యూటీ అక్షర గౌడ ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటిస్తోంది. నాగార్జునతో రొమాన్స్ చేస్తున్న బ్యూటీ అక్షర గౌడనే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. నాగార్జున ఇంకా ఎంతమందితో రొమాన్స్ చేశాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.