గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, నాగ చైతన్య వివాహ బంధంతో ఒక్కటైన సామ్, చై వైరల్ గా మారిన చై, సామ్ ఫోటో
టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు వివాహ బంధంతో ఇటీవలే ఒక్కటయ్యారు. వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. తాజాగా సినీ అభిమానుల్లో ఒక అనుమానం మొదలైంది. అదేంటంటే సమంత అసలు అత్త ఎవరు అని?
యువ సామ్రాట్ నాగార్జున మొదట హీరో వెంకటేష్ సోదరి లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కలిగిన సంతానమే నాగ చైతన్య. తర్వాత నాగ్.. ఆమెతో విడిపోయి సినీ నటి అమలను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి సంతానం అఖిల్ అన్న విషయం తెలిసిందే.
నాగ చైతన్య తల్లి లక్ష్మి.. నాగార్జున నుంచి విడిపోయినప్పటికీ.. కొడుకుతో మాత్రం ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటారు. దీంతో సమంత కూడా ఆమెతో సంబంధాలు కొనసాగిస్తోందని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇకపోతే.. నాగార్జున ప్రస్తుత భార్య అమల. సమంత వివాహం తర్వాత నాగార్జున, అమల, అఖిల్ తో కలిసే ఉండాలి. కాబట్టి ఇప్పుడు సమంత వీరిద్దరిలో ఎవరిని అత్తగారిలా భావిస్తుందనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఇక ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం చైతూ, సామ్ ల ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. వివాహం తర్వాత వీరు దిగిన తొలి ఫోటో ఇది. ప్రత్యూష ఫౌండేషన్ వైద్యురాలు మంజులతో కలిసి దిగిన ఫోటోలో సమంత మెడలో పసుపు తాడు, నల్ల పూసలతో కనిపిస్తోంది.
