ప్రస్తుతానికి 'యాత్ర 2' గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? 


 2019 ఎన్నికల ముందు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేయగా ఆ తర్వాత వైసీపీకి పూర్తిస్థాయిలో ఫీవర్ చేసేందుకేనా? అన్నట్టుగా గతంలో ఆనందో బ్రహ్మ వంటి సినిమా డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ యాత్ర అనే సినిమా చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో సాగిన ఈ సినిమా మొత్తం మీద జగన్ ప్రస్తావన ఏ మాత్రం ఉండదు కానీ వైసీపీ అభిమానులకు అలాగే వైయస్సార్ అభిమానులకు జగన్ మీద ప్రేమ కలిగే విధంగా మాత్రం సినిమా రూపొందించారు. ఆ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో రెండో భాగం కూడా తెరకెక్కిస్తారని సరిగ్గా 2024 ఎన్నికల ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది .

'యాత్ర' విడుదలైన కొన్నాళ్లకు దానికి సీక్వెల్ 'యాత్ర 2' (Yatra 2 Movie) తీస్తారని మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా సీక్వెల్ ఉంటుందని తెలిపారు. అయితే యాత్ర రిలీజై ఇంతకాలం అయినా ఇప్పటి వరకు అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. అందువల్ల, ఆ సినిమా ఉంటుందా? లేదా? అని సందేహాలు నెలకొన్నాయి. అటువంటి వాటికి మహి వి. రాఘవ్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. 

మహి వి. రాఘవ్ మాట్లాడుతూ... 'యాత్ర 2' తప్పకుండా ఉంటుందని అన్నారు . అయితే, సినిమా గురించి ఎక్కువ వివరాలు చెప్పలేదు. ''ప్రస్తుతానికి 'యాత్ర 2' గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను... 'యాత్ర 2', నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా'' అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. 

వైఎస్ఆర్ బయోపిక్ ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ఆర్ పాత్రలో ఆయన ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు మహి వి రాఘవ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ గా సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్ర కథాంశం...వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ‘యాత్ర 2’ మొదలవుతుంది. ఆ సమయంలో జగన్ ఎలా ఉండేవారు..? తండ్రి మరణం తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? ఓ రాజకీయనాయకుడిగా ప్రజలకు ఎలా మెప్పించగలిగాడనే విషయాలతో ‘యాత్ర 2’ని తెరకెక్కించబోతున్నారని వినికిడి.

ఈ నేపధ్యంలో జగన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ‘రంగం’ ఫేమ్ నటుడు అజ్మల్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మహి వి రాఘవ్ మాత్రం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ‘స్కామ్ 1992’లో నటించిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. ప్రతీక్ లో జగన్ పోలికలు ఉన్నాయని.. అతడి రాకతో ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన్నే ఫైనల్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే అదే సమయంలో తమిళ నటుడు సూర్య ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దుల్కర్ ని సైతం ఈ ప్రాజెక్టులోకి తెచ్చే అవకాసం ఉందని చెప్పుకున్నారు. కానీ ఫైనల్ గా ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

 ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అవ్వడమే గాక ఆ తరువాత రోజు వ్యూహం, శపథం అంటూ రెండు సినిమాలు చేస్తున్నానని ఆయన ప్రకటించారు..